Eyes: ‘మీ కళ్లను ప్రేమించండి’ అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా..
ABN , Publish Date - Oct 09 , 2025 | 10:29 AM
సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైంది, ప్రధానమైనవి నేత్రాలే. వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం చీకటి మయమే. ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే కళ్లను కాపాడుకోవాల్సిందే.
- కంటిని కాపాడుకుందాం..
- నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం
హైదరాబాద్: సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైంది, ప్రధానమైనవి నేత్రాలే. వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం చీకటి మయమే. ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే కళ్లను కాపాడుకోవాల్సిందే. ప్రతీ ఏడాది అక్టోరు నెల రెండో గురువారం ప్రపంచ దృష్టిదినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ‘మీ కళ్లను ప్రేమించండి’ అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా నేత్రాల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య శాఖలు నిర్వహిస్తున్నాయి.

ప్రస్తుతం తల్లులు పిల్లలకు సెల్‌ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. దీనివల్ల కళ్లలోని రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. చిన్నారులు ఎక్కువగా సెల్‌ఫోన్‌లు చూడటం, వీడియో గేమ్స్ ఆడటం వల్ల దృష్టిలోపం సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసేవారు, కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్ ఉపయోగించేటప్పుడు కళ్లకు డైరెక్ట్‌గా వెలుతురు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే వాల్‌నట్స్, బాదం, పిస్తా, సి-విటమిన్ అధికంగా ఉండే పచ్చటి ఆకుకూరలు తీసుకుంటే కంటికి మంచిదంటున్నారు వైద్యులు.
నిర్లక్ష్యం వద్దు
కళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు. కంటిలో ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కంటి సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే అంధత్వానికి గురయ్యే ప్రమాదం ఉంది.
- రెడ్డి శ్రీనివాస్, నేత్ర వైద్యుడు, అల్వాల్
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News