Share News

Winter Season: శీతాకాలంలో వీటి జోలికి అస్సలు వెళ్లకండి.. డేంజర్‌లో పడతారు..

ABN , Publish Date - Dec 24 , 2025 | 01:59 PM

శీతాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల రోగాలు చుట్టుముడుతుంటాయి. అందుకే ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కొన్ని తిండి పదార్ధాలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Winter Season: శీతాకాలంలో వీటి జోలికి అస్సలు వెళ్లకండి.. డేంజర్‌లో పడతారు..
Foods to Avoid in Winter

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ సీజన్‌లోనే ఎక్కువ రోగాలు మనల్ని చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, అస్తమా, శ్వాసకోస ఇబ్బందులు ఉన్నవారు శీతాకాలంలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ద చూపించాలని అంటారు. చలికాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ వ్యవస్థలో మార్పులు జరుగుతుంటాయి..అందుకే ఈ క్రింది వాటి జోలికి అస్సలు వెళ్లకండి.


1. శీతాకాలంలో చాలా మంది ఐస్ క్రీమ్స్(Ice creams), చల్లటి పానియాలు(Cool drinks),పండ్లు (fruits) ఎక్కువగా ఫ్రిజ్ (fridge)లో దాచిపెడుతుంటారు. అలా ఫ్రిజ్‌లో ఉంచిన పదార్ధాలను వెంటనే తినేయకూడదు.అలా తింటే గొంతు ఇన్ఫెక్షన్లు(Throat infections), జలుబు, రొంప, సైనస్ (Sinus) సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యల వల్ల రాత్రి సరిగా నిద్రపట్టదు.

2. చలికాలంలో ఎక్కువగా స్వీట్స్ తినడం చాలా డేంజర్. ఎందుకంటే చక్కెర (Sugar) పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి (Immunity) తగ్గిపోతుంది. దీని వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు చక్కెర బదులు బెల్లం లేదా తేన వాడటం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

3. ఈ సీజన్ లో ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాల(Processed Foods)కు దూరంగా ఉంటే చాలా బెటర్. ముఖ్యంగా చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంగ్ ఫుడ్స్ త్వరగా జీర్ణం కావు..అందువల్ల కడుపు ఉబ్బరంగా ఉండటం, గ్యాస్ ట్రబుల్స్ సమస్యలు వస్తుంటాయి.


4. చలికాలం మీకు జలుబు,దగ్గు, జ్వరం వస్తే చాలా వరకు పాలు (Milk), పెరుగు(curd)కు దూరంగా ఉంటే మంచిది. ఇవి శరీరంలోని శ్లేష్మాన్ని (Mucus) పెంచుతాయి. ఒకవేళ పాలు తాగాలనుకుంటే అందులో కాస్త పసుపు, మిరియాల పొడి కలిపి తాగితే మంచి ఔషదంగా పనిచేస్తుంది.

5. శీతాకాలంలో అస్సలు తినకూడని పదార్థాల్లో ముఖ్యమైనది మైదా (Maida). చాలా మంది మైదా పిండితో చేసిన ఫుడ్ ఐటమ్స్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ దాని వల్ల చాలా నష్టాలు ఉన్నాయని తెలుసుకోరు. మైదాతో చేసిన పదార్థాలు శరీరంలో బద్దకాన్ని పెంచుతాయి. మలబద్దకాని (constipation) కి దారి తీస్తాయి. అందుకే శీతా కాలంలో చాలా వరకు పీచు పదార్ధాలు(Fiber), పోషక విలువలు ఉన్న తృణధాన్యాలు తీసుకుంటే మంచిది.

6. వేయించిన ఆహార పదార్ధాల (Fried Foods)కు దూరంగా ఉంటే బెటర్. చలికాలంలో చాలా మంది వేడి వేడిగా ఏదైనా తినాలనే కోరిక ఉంటుంది. ఎక్కువగా బజ్జీలు, పకోడీలు, సమోసాలు తింటారు. కానీ, వీటిలో ఉండే ‘ట్రాన్స్ ఫ్యాట్స్’ శరీరంలో మంటను (Inflammation) కలిగిస్తాయి. జీర్ణక్రియ సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. దాంతో తెలియకుండానే అధిక బరువు పెరగడానికి కారణం అవుతుంది.


7. చాలా మంది చలికాలంలో ఎక్కువగా కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ వల్ల శరీరంలో కెఫిన్ (Excessive Caffeine) పెరిగి డీహైడ్రేషన్ జరుగుతుంది. వింటర్ సీజన్ లో చర్మం మరింత పొడిబారి నిద్రలేమికి దారి తీస్తుంది. కాఫీ, టీ కి బదులు హెర్బల్ టీ లేదా బెల్లం టీ పరిమితంగా తీసుకుంటే మంచిది.

8. రాత్రి పూట ఎక్కవగా తినడం మంచిది కాదు. చలికాలంలో పడుకునే ముందు ఇష్టానుసారంగా తింటే తర్వాత చిక్కుల్లో పడపోతారు. ఎక్కువగా తిని పడుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. అందుకే చీకటి పడగానే నిద్రపోవడం, లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

9.చలికాలంలో ఫుడ్‌తో పాటు ఈ జాగ్రత్తలు కూడా పాటిస్తే మంచిది. చలికాలంలో కిటికీలు, తలుపులు పూర్తిగా మూసేసి ఉంచకండి. దీని వల్ల గదిలో గాలి తగ్గి బాక్టీరియా, వైరస్ వెంటనే వ్యాప్తి చెందుతుంది. చాలా వరకు స్వచ్చమైన గాలి వచ్చేలా చూసుకుంటే మంచిది.

10. శీతాకాలంలో చిన్న చిన్న చిట్కాలు అంటే పడుకునే ముందు చేతులకు, పాదాలకు కొబ్బరి నూనె కానీ, ఆవనూనెతో కానీ మసాజ్ చేసుకుంటే మంచిది. స్నానం చేసిన వెంటనే చర్మం తేమగా ఉన్నపుడు కొబ్బరి నూనెతో మాయిశ్చరైజర్ చేసుకుంటే పగుళ్లు, దురదలకు చెక్ పెట్టొచ్చు.


Also Read:

న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )

Updated Date - Dec 24 , 2025 | 02:03 PM