Winter Season: చలికాలంలో కీళ్లనొప్పులా.. ఇదిగో సింపుల్ పరిష్కారం ..
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:21 PM
శీతాకాలం. చలి విపరీతంగా ఉంటుంది. ఈ కాలంలో కీళ్ల నొప్పులతోపాటు శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు వస్తాయి. అలాంటి వేళ.. సింపుల్ చిట్కాతో ఆ సమస్యను అదిగమించవచ్చు.
Health Benefits Of Horse Gram: రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రతల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా రోగనిరోధకశక్తి బలహీనంగా మారుతుంది. దీంతో వైరస్‌లు, బ్యాక్టీరియా వేగంగా శరీరంలో ప్రవేశిస్తాయి. శాస్వ నాళాలు బలహీనపడి అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అలా జరగకుండా ఉండాలంటే.. సరైన పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పోషకాలు అధికంగా ఉండే ఉలవలను రోజు డైట్‌లో చేర్చుకోవాలని చెబుతున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.
చిరు ధాన్యాల్లో ఒకటి ఉలవలు. పోషకాహార లోపంతో బాధపడే వారు వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. వీటిలో కార్పోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్, భాస్వరం, పీచుతోపాటు బీ1, బీ2, బీ6, సీ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే మాంసాహారానికి సమానంగా ప్రొటీన్ కూడా వీటిలో లభిస్తోంది. ఇవన్నీ పుష్కలంగా ఉండే వీటిని రోజు తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచిస్తున్నారు. శీతాకాలంలో ఉలవలు తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి.
ఉలవలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..
వీటిలో సాల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధితన సమస్యలు ఎదురుకావని చెబుతారు. ఇవి ఆకలిని పెంచుతాయి. అధిక బరువుని సైతం నియంత్రిస్తుంది.
శ్వాస సంబంధిత సమస్యలకు చెక్..
చలికాలంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత సమస్యల బారిన పడుతుంటారు. ఈ సమయంలో ఉలవలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఇస్తుంది.
జలుబు, ఆస్తమా (ఉబ్బసం), బ్రాంకైటిస్, గొంతు ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్, అల్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు.
గుండె ఆరోగ్యానికి మేలు..
వీటిలో ఫెనోలిక్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్‌ని కరిగిస్తాయి. ఇవి యాంటీ లిథోజెనిక్‌గా పని చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తొడ్పడుతుంది. వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ స్వల్పంగా ఉంటుంది. దీంతో రక్తపోటు, చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.
రక్తహీనత, కీళ్ల నొప్పులు, ఎముక సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే వారు.. ఉలవలు తీసుకోవడం ద్వారా త్వరితగతిన ఉపశమనం కలిగిస్తుంది.
రుతుక్రమ సమస్యల ఇబ్బంది పడే మహిళలు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లూ, ఖనిజ లవణాలు చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
వీటిని ఏ విధంగా తీసుకోవచ్చంటే..?
ఉడికించిన నీటిని మరగకాచి ఉలవచారుగా చేసుకోవచ్చు. చాలా మందికి ఇది ఎంతో ఇష్టంగా తింటారు. లేకుంటే రసం, సాంబార్‌గా చేసుకోవచ్చు. టమాటాలతో కలిపి కూర కూడా చేయవచ్చు.
వీటిని ఉడికించి.. గుగ్గిళ్లు లేదా నానబెట్టి మొలకలొచ్చాక తినొచ్చు. వాటిని తాళింపు వేసి.. దీనిపై కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, చాట్ మసాలా చల్లితే చాలా రుచికరంగా ఉంటుంది.
గమనిక: మీకు అందించిన ఆరోగ్య సమాచారం..సూచనలు అన్ని మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
ఈ వార్తలు కూడా చదవండి..
భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?
Read Latest Health News and National News