Share News

Banana: ఈ సమస్యలున్నాయా.. అరటి పండ్లు తినకపోవడం ఉత్తమం

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:13 PM

అరటిపండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు.. ఈ అరటి పళ్లను తినకపోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Banana: ఈ సమస్యలున్నాయా.. అరటి పండ్లు తినకపోవడం ఉత్తమం
Banana

మనిషి ఆరోగ్యానికి సంబంధించి మార్కెట్‌లో అత్యంత చౌకగా లభించే పండు ఏదైనా ఉందంటే.. అది అరటిపండే. అలాంటి అరటి పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పుడైనా నిరసంగా అనిపిస్తే.. ఆ వెంటనే ఒక అరటి పండు తీసుకోవడం వల్ల కొన్ని సెకన్లలోనే శరీరానికి శక్తి అందినట్లు అవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అయితే ఒక్క అరటి పండు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో... పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకుంటే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఆ సమస్యలు ఉన్నవారు అరటి పండ్లు తీసుకోకపోవడమే ఉత్తమమని అంటున్నారు. ముఖ్యంగా అలెర్జీ, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, ఉబ్బసం, జీర్ణ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అరటి పండ్లు హానికరమని పేర్కొంటున్నారు.


బరువు తగ్గాలనుకునే వారితోపాటు డైట్ ఫాలో అయ్యేవారు అరటిపండ్లు తినవద్దని సూచిస్తున్నారు. అరటిపండ్లను అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇక షుగర్ వ్యాధిగ్రస్తులకు అరటిపండ్లు చాలా హానికరం. ఎందుకంటే వీటిలో సహజంగా చక్కెర ఉంటుంది. అలాగే ఉబ్బరం, గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అరటి పండ్లను తీసుకోకపోవడం మంచిది.


అలాగే ఖాళీ కడుపుతో అరటి పండ్లు తినడం వల్ల శరీరంలో పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల వికారం లేదా వాంతులవుతాయి. దీంతో ఖాళీ కడుపుతో అరటి పండ్లు తీసుకోకూడదు. ఇక మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారు సైతం అరటి పండ్లు తినకపోవడం మంచిది. వాటిలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాలపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో ఈ సమస్యతో ఇబ్బంది పడే వారు అరటి పండ్లు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

టాటూ ఉన్న వాళ్లు రక్తదానం చేయడం మంచిదేనా..

మిలమిల మెరిసే తెల్లటి దంతాల కోసం బేకింగ్ సోడా వాడవచ్చా..

For More Health News

Updated Date - Jun 25 , 2025 | 01:34 PM