Effects Of Tight Clothes: బిగుతైన దుస్తులతో కలిగే అనర్థాలు ఇవే
ABN , Publish Date - Apr 20 , 2025 | 10:12 PM
దుస్తులు మరీ బిగుతుగా ఉంటే దీర్ఘకాలంలో పలు అనార్థాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నె్ట్ డెస్క్: ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో అయ్యే అనేక మంది బిగుతైన దుస్తులు ధరించేందుకు ఇష్టపడతారు. ఇలా చేస్తే తాము సన్నగా అందంగా కనబడతామని కూడా అనుకుంటారు. కొందరు జిమ్‌కు వెళ్లేటప్పుడు కూడా ఇలాంటి దస్తులు వేసుకుంటారు. ఓ మోస్తరు బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే ఫరవాలేదు కానీ దుస్తులు మరీ టైట్‌గా ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
దుస్తులు మరీ బిగుతుగా ఉన్నాయనేందుకు ప్రధాన సూచన చర్మంపై ఒత్తిడి తాలూకు చారలు ఏర్పడటమే. ముఖ్యంగా నడుము, కాళ్ల చుట్టూ ఇవి ఏర్పతాయి. బిగుతైన దుస్తుల కారణంగా రక్తప్రసరణ తగ్గి ఈ సమస్య వస్తుంది. ఇది మితిమిరితే వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలకూ దారి తీయొచ్చు.
సింథటిక్ దుస్తులతో చర్మంపై ఒరిపిడి మరింతగా పెరిగి చర్మం కందిపోవడం, దురదలు, డెర్మటైటిస్ వంటి సమస్యలు వస్తాయి.
నాడులపై ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో కొంత భాగం మొద్దు బారినట్టు అనిపిస్తుంది. దుస్తులు మరీ బిగుతుగా ఉంటే ఈ సమస్య పక్కా
టైట్‌గా ఉండే బ్రా వేసుకునే మహిళల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
జిమ్‌లో బిగుతైన దుస్తుల కారణంగా కసరత్తు చేసే శక్తి సన్నగిల్లుతుంది.
బిగుతైన దుస్తులతో కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి. మహిళల్లో టైట్ బ్రాల కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. భుజాలు, మెడ నొప్పులు కూడా వదలకుండా వేధిస్తాయి.
పొట్ట చుట్టూ బిగుతైన దుస్తుల కారణంగా ఎసిడిటీ, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.
బిగుతైన దుస్తుల వల్ల మహిళల్లో దీర్ఘకాలంలో వెజైనల్ ఇన్ఫెక్షన్లు కూడా తలెత్తే ముప్పు ఉంది. నిత్యం నాడులపై ఒత్తిడి పెరిగితే మొద్దుబారినట్టు అనిపిస్తుంది. ఆ తరువాత దీన్ని చక్కదిద్దడం కష్టంగా మారుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజరే..
ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?