Back Pain Relief Tips: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:53 PM
చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు మీరు కూడా నడుం నొప్పితో బాధపడుతున్నారా.. అయితే, ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో చాలా మంది నడుము నొప్పితో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. మీరు కూడా అలానే నడుం నొప్పితో బాధపడుతున్నారా? అయితే, ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. ఒక్కొక్కసారి నడుము నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. నడుం నొప్పి వచ్చినప్పుడు చిన్న పని చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు లేవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. నడుం నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఇలా చేయండి.
నడుము నొప్పి ఉంటే కదలడానికి, కూర్చోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి, రిలీఫ్ పొందడానికి యోగ, ఏరోబిక్, స్విమ్మింగ్ వంటివి చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల నడుం నొప్పి తగ్గుతుంది. యోగ, స్విమ్మింగ్, వాకింగ్ లాంటి తక్కువ తీవ్రత ఉండే వ్యాయామాలని చేయాలని, ఎక్సర్సైజ్ చేస్తే కచ్చితంగా నొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వాపు ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒక గుడ్డలో ఐస్ క్యూబ్స్ వేసి కాపడం పట్టడం మంచిదని కూడా చెబుతున్నారు. అంతేకాకుండా, హాట్ వాటర్ బ్యాగ్‌ని కూడా వాడొచ్చు. అలాగే, సరైన పోస్టర్‌లో నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే, ఫిజియోథెరపీ చేయించుకోవడం, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే కూడా నడుం నొప్పిని తగ్గిస్తుంది.
Also Read:
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ నీరు తాగితే వెంటనే ఉపశమనం!
For More Latest News