Diwali Detox Drink: దీపావళి తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా? ఈ హెల్తీ డ్రింక్ తాగితే చాలు.!
ABN , Publish Date - Oct 21 , 2025 | 02:11 PM
దీపావళి పండుగ సందర్భంగా ఇష్టమైనవి అన్నీ లాగించేసి కడుపు ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఈ హెల్తీ డ్రింక్ మీకు ఎంతగానో సహాయపడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, క్రాకర్లు కాల్చడం తోపాటు, పిండి వంటల విందులతో జనం ఎంతో సందడి చేశారు. అయితే, పండుగ కావడంతో చాలా మంది ఇష్టమైన స్వీట్లతో పాటు అన్నీ రకాల వంటలను ఫుల్‌గా లాగించేసి ఇప్పుడు కడుపు ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మీరు కూడా అలానే కడపు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ హెల్తీ డ్రింక్ మీకు ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిమ్మకాయ-కొబ్బరి నీరు కలిపి తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‍గా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ మిశ్రమంలో ఉండే ఎలక్ట్రోలైట్స్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
నిమ్మకాయ-కొబ్బరి నీటి ప్రయోజనాలు:
శరీరానికి హైడ్రేషన్: కొబ్బరి నీటిలోని అధిక నీటి శాతం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని త్వరగా రీహైడ్రేట్ చేస్తాయి.
రోగనిరోధక శక్తి పెరుగుదల: నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, కొబ్బరి నీటితో కలిసి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
చర్మ ఆరోగ్యం: ఈ పానీయంలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ మెరుగుదల: కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయం: కొబ్బరి నీటిలో సహజంగా చక్కెరలు ఉంటాయి కానీ, సోడాలు వంటి ఇతర పానీయాల కంటే కేలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
శరీరంలోని మంట తగ్గుదల: కొబ్బరి నీరు, నిమ్మకాయ రెండింటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
ఇవి కూడా చదవండి..
పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ
Yarapathineni Slams Jagan: ఆ భూతం లేకపోవడంతో రెట్టింపు ఉత్సహంతో దీపావళి వేడుకలు..
Read Latest AP News And Telugu News