Heart Attack Prevention Medicine: గుండెపోటు నివారణలో ఆస్పిరిన్‌కు బదులుగా కొత్త మందు..
ABN , Publish Date - Sep 01 , 2025 | 08:46 AM
గుండె సంరక్షణ కోసం చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఆస్పిరిన్ మందు ఇప్పుడు మారవచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. తాజా పరిశోధనలో ఏం తేలిందంటే..
ఇంటర్నెట్ డెస్క్: గుండె సంరక్షణ కోసం చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఆస్పిరిన్ మందు ఇప్పుడు మారవచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. తాజా పరిశోధనలో ఏం తేలిందంటే.. క్లోపిడోగ్రెల్ (Clopidogrel) అనే మరో ఔషధం, ఆస్ప్రిన్ కంటే మరింత ప్రభావవంతంగా గుండెపోటు, స్ట్రోక్‌లను తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఇది రక్తాన్ని పలుచబరిచే ఔషధం, కానీ ఆస్ప్రిన్ లాగా రక్తస్రావం ప్రమాదం పెంచదని తేలింది.
తాజా పరిశోధనలో ఏమి తేలింది?
యూరోప్‌లో జరిగిన కార్డియాలజీలో దాదాపు 29,000 మంది రోగులపై చేసిన 7 క్లినికల్ ట్రయల్స్ క్లోపిడోగ్రెల్.. గుండెపోటు, స్ట్రోక్‌లు వంటి సమస్యలను ఆస్ప్రిన్ కంటే 14% ఎక్కువగా తగ్గించింది. రక్తస్రావం ప్రమాదం ఆస్ప్రిన్‌తో సమానంగా ఉంది. దీని ప్రభావం వాడిన రెండు గంటల్లో మొదలై 5 రోజులపాటు ఉంటుంది. ఈ ఫలితాల ఆధారంగా, నిపుణులు గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ఆస్ప్రిన్ స్థానంలో క్లోపిడోగ్రెల్ ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.
క్లోపిడోగ్రెల్ అంటే ఏమిటి?
క్లోపిడోగ్రెల్ (Clopidogrel) సాధారణంగా ప్లావిక్స్ (Plavix) అనే పేరుతో కూడా తెలిసిన ఔషధం. ఇది రక్తంలోని ప్లేట్‌లెట్‌లను కలిసిపోయి గడ్డకట్టకుండా అడ్డుకుంటుంది. స్టెంట్‌లు పెట్టిన తర్వాత లేదా గుండె సమస్యల తర్వాత దీన్ని తరచుగా వాడతారు.
దీర్ఘకాలిక గుండె సంరక్షణ కోసం?
ఇప్పటికే కొన్ని ఇతర అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని మద్దతు ఇస్తున్నాయి. కొన్ని ట్రయల్స్ (సుమారు 16,000 మంది పైగా రోగులపై) చూపిన ప్రకారం.. క్లోపిడోగ్రెల్ వంటి మందులు ఆస్ప్రిన్‌తో పోలిస్తే గుండెపోటు, స్ట్రోక్ లేదా మరణం ప్రమాదాన్ని 23% వరకు తగ్గించాయి. అదనపు రక్తస్రావం ప్రమాదం కూడా పెద్దగా లేదని తేలింది. దీంతో, గుండెపోటు ప్రమాదం ఉన్నవారికి దీర్ఘకాలికంగా క్లోపిడోగ్రెల్ వాడటం ప్రత్యామ్నాయంగా మారుతోంది.
ఇప్పటి వరకు గుండెపోటు నివారణకు ఆస్ప్రిన్ ప్రధాన ఔషధంగా వాడుతూ వస్తున్నాం. కానీ తాజా పరిశోధనలు, ఫలితాల ప్రకారం, క్లోపిడోగ్రెల్ అనే ఔషధం మరింత ప్రభావవంతమైన ఎంపిక కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
భారీ భూకంపం.. 9 మంది మృతి, 15 మందికి గాయాలు
నాటిన చెట్లలో బతికున్న వాటికే గ్రీన్ క్రెడిట్స్
For More Latest News