Naatu Egg vs Farm Egg: నాటు గుడ్డు వర్సెస్ ఫారం గుడ్డు.. ఆరోగ్యానికి ఏది మంచిది?
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:58 PM
రోజు గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిందంటారు. గుడ్డు తినడం వల్ల కలిగే లాభాలను పోషకాహార నిపుణులు చెబుతారు. మరి నాటు కోడిగుడ్డు మంచిదా? ఫారం కోడిగుడ్డు మంచిదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో దాదాపుగా వ్యక్తమవుతుంది.
రోజు గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిందంటారు. గుడ్డు తినడం వల్ల కలిగే లాభాలను పోషకాహార నిపుణులు చెబుతారు. మరి నాటు కోడి గుడ్డు మంచిదా ఫారం కోడిగుడ్డు మంచిదా? అనే సందేహం ప్రతి ఒక్కరిలో దాదాపుగా వస్తుంది. ఆ క్రమంలో ఏ గుడ్డు మంచిదో పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
గుడ్డు తీసుకోవడం వల్ల శరీరం బరువును అదుపులో ఉంచుతుంది.
అల్పాహారంగా కోడిగుడ్డును తీసుకుంటే మంచిది. వాటిని తరచూ తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
ఫారం కోడిగుడ్డులోనైనా.. నాటు కోడి గుడ్డులోనైనా పోషకాలు ఒకే విధంగా ఉంటాయి. ఏ గుడ్డు తిన్నా.. పోషకాలు మాత్రం శరీరానికి పుష్కలంగా అందుతాయి.
గుడ్డు పౌష్టికాహారం. ఇందులోని మాంసకృత్తులు.. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గోధుమలు, పప్పులు, బియ్యంలోని ప్రోటీన్ల విలువతో పోలిస్తే గుడ్డులో ఇవి అధికంగా ఉంటాయి. అందుకే ప్రోటీన్ల స్థానంలో గుడ్డు అగ్రస్థానంలో ఉంది.
పప్పుల్లో ఉండే ప్రోటీన్లతో పోలిస్తే గుడ్డులోని ప్రోటీన్లే చాలా త్వరగా జీర్ణమవుతాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు.
అయితే ఫారం కోడి గుడ్డులో కంటే.. నాటు కోడి గుడ్డులో పోషకాలు అధికంగా ఉంటాయని అంతా అనుకుంటారని.. కానీ అందులో వాస్తవం లేదని చెబుతున్నారు. ఈ రెండు రకాల గుడ్డుల్లో ఒకే పరిమాణంలో పోషకాలు ఉంటాయని వివరిస్తున్నారు. రోజుకో గుడ్డు ఎదిగే చిన్నారులకు ఆహారంగా ఇవ్వాలంటున్నారు. గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ ఐరన్ గర్భిణీలు, బాలింతలకు బాగా ఉపయోగపడుతుంది.
గుడ్డు తినడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
జుట్టుతోపాటు గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యానికి మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ విదేశీ పర్యటన రద్దుపై విచారణ.. కోర్టు ఏం చెప్పిందంటే..
For More Health News And Telugu News