Share News

Air Pollutants: గర్భిణిలపై కాలుష్య ప్రభావం..

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:26 PM

వాయు కాలుష్య కారకాలు.. మరి ముఖ్యంగా పీఎం 2.5.. స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తాయి. ఇది స్పెర్మ్ కదలికలు, వాటి నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఓజోన్ సైతం స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది.

Air Pollutants: గర్భిణిలపై కాలుష్య ప్రభావం..

న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశంలో వాయి కాలుష్య కారకాల స్థాయి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఉత్తర భారతాన్ని ఈ సమస్య పట్టి పీడిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాలకు సైతం ఈ సమస్య విస్తరిస్తుంది. దీనిని ప్రమాదకరమైన గాలి నాణ్యత సూచిక (AQI) స్పష్టం చేస్తోంది. దీని వల్ల శ్వాసకోశ, గుండెకు సంబంధించిన సమస్యలతోపాటు క్యాన్సర్లు, సంతానోత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపతోంది. దీనితోపాటు ఒత్తిడి, మానసిక అలసట, చికాకును కూడా కలిగిస్తుంది. ఈ వాయు కాలుష్యం.. మనిషి హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పునరుత్పత్తి వ్యవస్థతోపాటు సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కాలుష్య కారకాలు.. సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, పీఎం 2.5, పీఎం 10.


సంతానోత్పత్తిపై ఎలా ప్రభావితం చేస్తుందంటే..? సంతానోత్పత్తి జరిగాలంటే.. మంచి అండాలతోపాటు స్పెర్మ్ కూడా అవసరం. ఇది పరిమాణంలో కాకుండా.. అందులో నాణ్యత సైతం ఉండాల్సి ఉంటుంది. అలా అయితేనే.. సంతానోత్పత్తి జరుగుతుంది. కానీ పీఎం 2.5 అండాశయ నిల్వను తగ్గిస్తుంది. ఇది సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది. ఈ కాలుష్య కారకాలకు గురికావడంతో కణాలకు వాపు, ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ కణాలు, రసాయనాలలో చాలా వరకు సెక్స్ సెల్స్‌ను విషపూరితంగా వర్గీకరిస్తున్నాయి.


గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న మహిళలపై ఇవి ఎలా ప్రభావితం చేస్తాయంటే..? ఈ కాలుష్యం కారణంగా.. కణాలకు వాపు, ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మహిళల్లో హార్మోన్లు, రుతుక్రమ సమస్యలతోపాటు సంతానోత్పత్తికి గల అవకాశాలు తగ్గిపోతాయి. గర్భం దాల్చే మహిళలపై ఈ కాలుష్య కారకాలు.. పీఎం 2., పీఎం10, ముల్లెరియన్ హార్మోన్, యాంట్రల్ ఫోలికల్ కౌంట్ స్థాయిలపై ప్రభావితం చేస్తాయి. ఇవి అండాశయ నిల్వ, గర్భం దాల్చే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఇక సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ గర్భస్రావాలు, మృత శిశువుల జననాల అవకాశాలను పెంచుతాయి.ఈ కాలుష్య కారకాలు.. సాధారణ హార్మోన్ల పనితీరును అస్తవ్యస్తంగా మారుస్తాయి. దాంతో బుతుస్రావం, గర్భధారణకు సంబంధించిన హార్మోన్లు గతి తప్పుతాయి. ఇక ఈ కారకాల ప్రభావం ఐవీఎఫ్‌తోపాటు సహాయక పునరుత్పత్తి అవకాశాలను సైతం తగ్గిస్తాయి.


పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయా?

వాయు కాలుష్య కారకాలు.. మరి ముఖ్యంగా పీఎం 2.5.. స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తాయి. ఇది స్పెర్మ్ కదలికలు, వాటి నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఓజోన్ సైతం స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది. ఇక ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ, నైట్రోజన్ ఆక్సైడ్ తదితర కాలుష్య కారకాలు.. టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. గాలిలోని ప్రమాదకర రసాయనాల వల్ల స్పెర్మ్‌లో నాణ్యత సైతం తగ్గుతుంది. కాలుష్యం, పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల వల్ల ఒత్తిడి పెరిగి.. హార్మోన్లు, అండంతోపాటు స్పెర్మ్ నాణ్యతపై ప్రభావితం చేస్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

శీతాకాలంలో ఈ పండ్లు తింటే చాలు

శీతాకాలం.. ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? జాగ్రత్త!

For More Health News

Updated Date - Nov 13 , 2025 | 05:56 PM