Share News

How to Identify Fresh Chicken : మీకు చికెన్ అంటే ఇష్టమా.. ఈ విషయం తెలుసుకోకపోతే ప్రమాదం..

ABN , Publish Date - Jan 19 , 2025 | 03:12 PM

మీకు నాన్ వెజ్ అంటే ఇష్టమా. రెగ్యులర్‌గా చికెన్ తింటున్నారా. అయితే, ఈ విషయం తెలుసుకోకపోతే చాలా ప్రమాదం..

How to Identify Fresh Chicken : మీకు చికెన్ అంటే ఇష్టమా.. ఈ విషయం తెలుసుకోకపోతే ప్రమాదం..
How To Identify Fresh Chicken

కూరగాయలు, పళ్లు కొనడానికి వెళ్లినపుడు అవి తాజావా కాదా అని చెక్ చేసి తీసుకుంటాం. సరుకులు తీసుకోవడానికి షాప్‌కి వెళ్లినా అంతే. ప్యాక్ చేసిన వాటి ఎక్స్‌పైరీ డేట్ గురించి పరిశీలించే అలవాటు చాలామందికి ఉండే ఉంటుంది. అలాగే చేపలు కొనేటప్పుడు కొందరు మంచివా కాదా అని చూస్తుంటారు. మరి, చికెన్ కొనడానికి వెళ్లినపుడు అలాగే చేస్తున్నారా.. లేకపోతే షాపు వాళ్లు ఇచ్చింది తీసుకుని ఇంటికి పట్టుకెళ్లిపోతున్నారా. కళ్ల ముందే కట్ చేయించి తీసుకుంటున్నాం కదా అని పట్టించుకోవడం లేదా. ఒకవేళ ఇదే తరహాలో రెగ్యులర్‌‌గా మీరు చికెన్ కొంటుంటే అది చాలా ప్రమాదమని మీకు తెలుసా.. అలా కాకూడదంటే.. చికెన్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..


ఇంటికి బంధువులు, స్నేహితులు వచ్చినా, ఏదైనా ప్రత్యేక సందర్భంలో నాన్ వెజ్ ఐటమ్ ఉండాల్సిందే అంటారు మాంసాహార ప్రియులు. వీరిలో చికెన్ తినేవాళ్ల సంఖ్యే అధికం. ఆదివారాలు, సెలవు రోజులు వచ్చాయంటే చికెన్ షాపుల ముందు క్యూ కడతారు. అందుబాటు ధరలోనే దొరకడమే అందుకు కారణం. అయితే, చికెన్ కొనేటప్పుడు ఎంతమంది మంచిదా కాదా అని పరిశీలిస్తున్నారు. కొందరు కళ్ల ముందే కదా కట్ చేసి ఇచ్చారని అని పెద్దగా పట్టించుకోరు. ఈ విషయం పక్కన పెడితే రెడీమేడ్ కోడి మాంసం తెచ్చుకునేవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి.


టేస్టీగా ఉంటుంది. తక్కువ ధరకే దొరుకుతుందని చికెన్ తెచ్చుకుంటాం. డాక్టర్లు కూడా చికెన్ తింటే మంచిదని చెప్పారని ఇంకా ఎక్కువ తినేస్తుంటారు కొంతమంది. క్వాలిటీ చెక్ చేసుకోకుండా ఏ ఐటమ్ తిన్నా హానికరమే. కాబట్టి, చికెన్ లవర్స్ ఈ చిట్కాల ద్వారా మంచిదో చెడ్డదో తెలుసుకోండి.

  • చికెన్ రంగు ద్వారా కూడా క్వాలిటీ గుర్తించవచ్చు. జాగ్రత్తగా చూస్తే చెడిపోయిన చికెన్ లేక పసుపు రంగులో కనిపిస్తుంది. అంటే దానిపై ఫంగస్ చేరిందని అర్థం.

  • చికెన్ కొనుగోలు చేసేటప్పుడు మొట్టమొదట గమనించాల్సింది వాసన. దీని ఆధారంగానే కుళ్లిపోయిన చికెన్‌కు, తాజా చికెన్‌కు మధ్య తేడా ఇట్టే కనిపెట్టేయచ్చు. ఎందుకంటే, తాజా చికెన్‌తో పోలిస్తే చెడిపోయిన

  • చికెన్ ఘాటైన వేస్తుంది. పుల్లటి కుళ్లిన వాసన ఉంటే అది మంచిది కాదని ఇట్టే పసిగట్టవచ్చు.


  • కొనేటప్పుడు చికెన్ ఎలాంటిదో కనిపెట్టలేకపోయినట్లయితే, వండిన తర్వాతైనా చెప్పవచ్చు. పాడైన చికెన్ వండిన తర్వాత రబ్బరులాగా ఉంటుంది.

  • మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ జనరేషన్‌ ఆన్‌లైన్‌ ద్వారా చికెన్ కొంటుంటారు. అలాంటి సందర్భాల్లో ఫ్రోజెన్ చికెన్ డెలివరీ చేసే అవకాశాలు ఎక్కువ. అదీగాక ఏమవుతుందిలే అనే ధోరణితో తెలిసినా తీసుకోవడమూ కరెక్ట్ కాదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, ఈ చిన్నపాటి చిట్కాల సాయంతో చెడిపోయిన చికెన్ ఏదో తేలిగ్గా తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Updated Date - Jan 19 , 2025 | 03:13 PM