Heart Disease Symptoms: మహిళల్లో గుండె జబ్బుల లక్షణాలు.. 6 అసాధారణ సంకేతాలు ఇవే..
ABN , Publish Date - Dec 29 , 2025 | 10:45 AM
సాధారణంగా మగవారిలో కనిపించే ఛాతి నొప్పికి భిన్నంగా మహిళల్లో గుండె జబ్బు సంకేతాలు ఉంటాయి. ఇవి సకాలంలో గుర్తించడం వల్ల మీరు మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది.
మహిళల(Womens) ఆరోగ్యం(Health) విషయంలో కొన్నిసార్లు వచ్చే చిన్న చిన్న మార్పుల విషయంలో నిర్లక్ష్యం(neglect) చేస్తుంటాం. కానీ.. అసాధారణ లక్షణాలు లోపల పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధులు అంటే గుండెపోటు, క్యాన్సర్ (Cancer) లేదా ఇతర సమస్యలకు సంకేతాలు కావొచ్చు. ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా గుండెపోటు (Heart Attack)మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2022లో దాదాపు 19.8 మిలియన్ల మరణాలు గుండెపోటు సంబంధిత వ్యాధులు(CVD) కారణం అయ్యాయి. గుండె జబ్బులు మహిళల కంటే పురుషులను ఎక్కువ ప్రభావితం చేస్తాయని అంటారు. కానీ.. అది నిజం కాదని, యునైటెడ్ స్టేట్స్ (United States)లో 60 మిలినియన్లకు పైగా మమిళలు సుమారు 44 శాతం ఏదో ఒక రకమైన గుండె జబ్బుతో జీవిస్తున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఒక నివేధికలో వెల్లడించింది.
1. కారణం లేకుండా అలసట :
మహిళల్లో గుండె జబ్బుల అసాధారణ సంకేతాల్లో ఒకటి విపరీతమైన అలసట. రోజువారీ కార్యకలాపాలతో త్వరగా అలసిపోవడం, గుండె కండరాలకు రక్త ప్రవాహం తగ్గడానికి సంకేతం కావొచ్చు. మెట్లు ఎక్కడం, షాపింగ్ ఇతర సాధారణ పనులు చేసే సమయంలో వెంటనే అలసిపోతారు. ఎందుకంటే గుండె సమర్ధవంతంగా రక్తాన్ని పంప్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఇవి గుండె జబ్బుకు కొన్ని వారాల ముందు వచ్చే సంకేతాలు.
2.దవడ లేదా మెడ నొప్పి :
మహిళల్లో దవడ, మెడ లేదా భుజాల వరకు నొప్పి వస్తే.. అది గుండె జబ్బుకు సంకేతం కావొచ్చు. చాలా మంది దంత సమస్య,మెడ నొప్పులు అంటూ చిన్న చిన్న చికిత్సలు తీసుకుంటారు. అప్పటి వరకు ఉపశమనం కలిగినా.. తర్వాత మళ్లీ రావడం మహిళల్లో గుండె ఒత్తిడిని సూచిస్తుంది. ఇలాంటి సమస్యలను విస్మరించడం వల్ల కొరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది.
3. సరిగా శ్వాస ఆడకపోవడం:
పడుకునే ముందు శారీరక శ్రమ లేకుండా హఠాత్తుగా శ్వాస ఆడకపోవడం, గుండె వెగంగా కొట్టుకోవడం మహిళల్లో గుండె జబ్బుకు ముఖ్య సంకేతం కావొచ్చు. ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడానికి కారణం అవుతుంది. ఆస్తమా ఉన్నవాళ్లకు రాత్రి పూట తీవ్ర ఇబ్బంది కలగడం గమనించవొచ్చు. పంపింగ్ బలహీనపడి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ఇబ్బంది కలిగినపుడు వెంటనే ECG చేయించుకొని డాక్టర్ సలహాలు పాటిస్తే మంచిది.
4. వికారం లేదా అజీర్తి:
మనం తినే ఆహారం పదే పదే వికారం, వాంతులు, అజీర్ణంతో కడుపు నొప్పి గుండెపోటుకు బలమైన సంకేతాలు అనొచ్చు. జీర్ణ సమస్యలు గుండె సంబంధిత వేగస్ నరాల చికాకు వల్ల వస్తాయి. చాలా మంది మహిళలు ఇలాంటి ఒత్తిడి, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు అనుభవిస్తుంటారు. ఈ జీర్ణ సమస్యల వల్ల కార్టియాక్ అవుట్ పుట్ గట్ రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. తద్వారా మహిళలు గుండె జబ్బు భారిన పడే అవకాశం ఉంది.
5. చేతులు, కాళ్ల వాపు:
ఎక్కువ శ్రమ చేయకున్నా.. కాలు, చీలమండ, పాదాల వాపులు వస్తాయి.. దీన్నే ఎడెమా అని పిలుస్తారు. ఇది గుండె పంపు సరిగా పనిచేయడం లేదని సూచిస్తుంది. ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల వస్తుంది. తరుచూ బరువు పెరగడం లేదా రక్త ప్రసరణ సరిగా లేకపోవడం గుండె జబ్బులకు ప్రధాన కారణం అని వైద్యు నిపుణులు చెబుతున్నారు.
6. చెమటలు పట్టడం..తల తిరగడం :
ఏ ప్రాంతంలో అయినా సరే వేడి లేకున్నా తెలియకండా చలి చెమటలు పట్టడం, అకస్మాత్తుగా తల తిరగడం, తలనొప్పి రావడం గుండె జబ్బుకు సంకేతం కావొచ్చు. ఈ లక్షణం గుండె ఇస్కీమియా వల్ల కలిగే స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థ ఓవర్ లోడ్‌ను సూచిస్తుంది. దీని ప్రభావం వల్ల మహిళలు మూర్చతో పాటు శరీరం బిగుతుగా ఉన్నట్లు భావిస్తుంటారు. ఎందుకంటే రక్త పోటు తగ్గడం మెదడును ప్రభావితం చేస్తుంది. ఇలాంటి లక్షణాలు గుండె పోటుకు ప్రధాన కారణాలు కావొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
ఇవి కూడా చదవండి
దశాబ్దాల నిరీక్షణ తర్వాత.. కలల ‘కప్పు’ దరి చేరిన వేళ!
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం