Drying Clothes Indoor: ఇంటిలోపలే దుస్తులు ఆరేస్తున్నారా? అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టే..
ABN , Publish Date - Feb 12 , 2025 | 09:07 PM
ఇంట్లో దుస్తులు ఆరేస్తే గాల్లో తేమ శాతం పెరిగి ఫంగస్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: బయట వాన పడుతున్నా లేక ఇంటి బయట స్థలం లేకపోయినా లోపలే దస్తులు ఆరేసుకుంటూ ఉంటాం. ఇది సాధారణ దృశ్యమే. ఈ అలవాటుతో ప్రమాదం ఉందని కూడా అనిపించదు. అయితే, ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఇందుకు సంబంధించి ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంటిలోపల ఆరేసే దుస్తుల కారణంగా లోపలి వాతావరణం మారి రోగాలు వచ్చే అవకాశం ఉంటుందట (Health).
Warm Water Drinks: నీటితో చేసే గోరువెచ్చని పానీయాలతో బరువు తగ్గుతారా? ఇందులో నిజమెంత?
వైద్యులు చెప్పే దాని ప్రకారం, ఇంటి లోపల దుస్తులు ఆరేయడం వల్ల వాతావరణంలో తేమ పెరుగుతుందట. ఫలితంగా పంగస్ పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఒక్క లోడ్ లాండ్రీ నుంచి సుమారు 2 లీటర్ల నీరు గాల్లో కలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా గాల్లో తేమ పెరిగి ఫంగస్ పెరిగేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది.
ఇక కిటికీలు దర్వాజాలు సరిగా లేని గదుల్లో తేమ గోడలు, సీలింగ్స్, విండోలపై నీరు రూపంలో పేరుకుంటుంది. చివరకు ఆయా చోట్ల ఫంగస్ పెరగడం ప్రారంభమవుతుంది. బిల్డింగ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ హైలైట్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఇంటిలోపల గాల్లో తేమ శాతం 60కి మించితే కచ్చితంగా ఫంగస్ పెరుగుదల మొదలవుతుంది. ఇంటిలోపల దుస్తులు ఆరేస్తే తేమ శాతం ఈ పరిమితికి మించి పెరుగుతుందని అధ్యయనకర్తు తేల్చారు.
Cardiovascular Health: గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే.. లైఫ్‌లో ఈ మార్పులు తప్పనిసరి!
ఇంట్లో పెరిగే ఫంగస్ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అలర్జీలు, ఇతర వ్యాధులు ఉన్నవారికి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఈ ఫంగస్ వెదజల్లే పూర్స్‌ను పీలిస్తే ఊపిరితిత్తుల సంబంధిత సమస్యల బారినపడాల్సి వస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. స్పోర్స్ వల్ల కలిగే ఎలర్జీతో దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం, కంటి దురదు, చర్మంపై ర్యాష్‌లు వంటివన్నీ వస్తాయి.
ఇక కొన్ని రకాల ఫంగస్ మైకోటాక్సిన్స్ అనే విషపదార్థాలను కూడా విడుదల చేస్తాయి. వీటితో నీరసం, తలనొప్పులతో పాటు రోగ నిరోధక శక్తి కూడా బలహీనమవుతుంది. చిన్నారులు, వృద్ధుల్లో ఇది మరిన్ని సమస్యలకు దారి తీస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇంట్లో దస్తులు ఆరేయకతప్పని సరిస్థితుల్లో డీహ్యూమిడిఫయ్యర్‌లు వాడితే సమస్య నుంచి కొంత వరకూ ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.