Share News

Cardiovascular Health: గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే.. లైఫ్‌లో ఈ మార్పులు తప్పనిసరి!

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:18 PM

గుండె ఆరోగ్యం పదికాలాల పాటు బాగుండాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Cardiovascular Health: గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే.. లైఫ్‌లో ఈ మార్పులు తప్పనిసరి!

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో అనేక మందిలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, మద్యపానం, ధూమపానం, ఫాస్ట్‌ఫుడ్ తినడం వంటి అలవాట్లతో 30 ఏళ్లు రాగానే జనాల ఆరోగ్యం గుల్లైపోతుంది. ఇవన్నీ గుండె సంబంధిత సమస్యలను పెంచుతున్నాయి. ఈ సమస్యలను నుంచి తప్పించుకునేందుకు జీవన శైలి మార్పులు కొన్ని తప్పవని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).

Wooden Cutting board: కూరలు తరిగేందుకు చెక్క బోర్డు వాడివారికో హెచ్చరిక!


కసరత్తులు

గుండె ఆరోగ్యం పది కాలాల పాటు కాపాడుకోవాలంటే కసరత్తులు తప్పనిసరి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ చేస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బీపీపై కూడా నియంత్రణ పెరిగి రక్తప్రసరణకు ఆటంకాలు తొలగిపోతాయి. అంతిమంగా ఇవి గుండె కండరాలను బలోపేతం చేస్తాయి.

పోషకాహారం

పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తినడం గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఆహారంలో పళ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్‌, ఆరోగ్యకర కొవ్వులు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ తినడం కొనసాగిస్తే మాత్రం దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ బారిన పడి చివరకు రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి.

Immunotherapy: క్యాన్సర్ చికిత్సలో ఈ అత్యాధునిక పద్ధతుల గురించి తెలుసా?


మద్యపానం వద్దు

మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే గుండె ఆరోగ్యానికి అంత మంచిది. ఎక్కువగా మద్యం తాగితే బీపీ పెరుగుతుంది. గుండె కండరాలు బలహీనపడతాయి. గుండె చలనంలో మార్పులు వస్తాయి. ఇవి తీవ్ర సమస్యలకు దారి తీస్తాయి.

ధూమపానం కూడదు

ధూమపానం వల్ల కూడా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్ అవకాశాలను పెంచుతుంది. ధూమపానంతో రక్తంలో ఆక్సీజన్ స్థాయిలు తగ్గి క్లాట్స్ ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి.

రక్తప్రసరణ బాగుండాలంటే తగినంత నీరు తాగడం తప్పనిసరి. రోజు మొత్తంలో కొద్ది కొద్దిగా నీరు తాగుతూ ఉంటూ రక్తం పలుచబడి క్లాట్స్ ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. డీహైడ్రేషన్ కారణంగా బీపీ పెరిగి గుండెపై ఒత్తిడి అధిగమవుతుంది.

గుండె ఆరోగ్యానికి తగినంత నిద్ర కూడా ఎంతో అవసరం. నిద్ర తక్కువైతే బీపీ పెరిగే అవకాశం ఉంది. నిద్రలేమి ఊబకాయం, గుండె చలనంలో మార్పులకు కూడా దారితీస్తుంది. కంటి నిండా నిద్రతో హార్మోన్లపై నియంత్రణ పెరుగుతుంది. జీవక్రియలు మెరుగై ఒత్తిడి దరిచేరదు.

Read Latest and Health News

Updated Date - Feb 10 , 2025 | 11:18 PM