Warm Water Drinks: నీటితో చేసే గోరువెచ్చని పానీయాలతో బరువు తగ్గుతారా? ఇందులో నిజమెంత?
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:13 PM
గోరు వెచ్చని నీటితో చేసే పలు పానీయాలు తాగితే బరువు సులభంగా తగ్గుతారని అనేక మంది భావిస్తుంటారు. అయితే, ఇది పూర్తిగా నిజంగా కాదని నిపుణులు చెబుతున్నారు. కెలొరీల ఖర్చే బరువు తగ్గేందుకు ప్రధానమైన సూత్రమని చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్యకాలంలో అనేక మంది బరువు తగ్గడం గురించి మాట్లాడుకుంటున్నారు. జీవనశైలిలో మార్పులు, డైట్‌లు వంటి వాటి గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో అనేక మంది గోరువెచ్చని నీటితో చేసే పుదీనా వాటర్, లవంగాల వాటర్ తదితరాలు అద్భుతాలు చేస్తాయని కూడా చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనే ప్రశ్నకు వైద్యులు సవివరమైన సమాధానమే ఇస్తున్నారు.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, గోరువెచ్చని నీటితో చేసే రకరకాల డ్రింక్స్‌లో కొవ్వు కరిగించే గుణాలు ఏవీ ఉండవట. అయితే, ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే మాత్రం జీర్ణవ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. విషతుల్యాలన్నీ తొలగపోయి మరింత ఆరోగ్యవంతంగా మారుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి లాభిస్తుంది (Health).
Cardiovascular Health: గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే.. లైఫ్‌లో ఈ మార్పులు తప్పనిసరి!
ఇక బరువు తగ్గాలంటే మాత్రం శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోయిన అదనపు కెలొరీలు కరిగించడం మినహా మరో మార్గం లేదని చెబుతున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి కొన్ని కెలొరీలు అవసరం. ఎన్ని కెలొరీలు కావాలి అనేది మాత్రం ఆయా వ్యక్తుల శరీర తత్వం, వయసు, జెండర్ వంటివాటిపై ఆధారపడి ఉంటుంది. మన శరీరంలోకి చేరే కెలొరీల కంటే ఎక్కువ కెలొరీలు ఖర్చు చేయడమే బరువు తగ్గడం వెనకున్న ప్రధాన సూత్రమని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన దానికంటే తక్కువ కెలొరీలు తీసుకుంటే శరీరంలో కొవ్వు రూపంలో ఉన్న శక్తి కరిగిపోయి క్రమంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. కెలొరీల ఖర్చు పెరిగే విధంగా ఆహారం తీసుకునేందుకు కొన్ని టిప్స్ కూడా పాటించాలని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తున్నారు.
Wooden Cutting board: కూరలు తరిగేందుకు చెక్క బోర్డు వాడివారికో హెచ్చరిక!
బరువు తగ్గాలనుకునే వారు ఒకేసారి కడుపు నిండా తినకుండా రోజు మొత్తంలో పలుమార్లు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. శరీరం బరువును అనుసరించి ఆహారం ఎంత తీసుకోవాలో నిర్ణయించుకోవాలి.
ఇక రకాల ఆహారాలు జీర్ణం చేసుకునేందుకు ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. ఉదాహరణకు కేరెట్లు, టమాటాలు, దోసకాయ, పుచ్చకాయ వంటివి తింటే శరీరంలో చేరే కెలొరీల కంటే ఎక్కువ మొత్తం ఖర్చై బరువు తగ్గుతారు.
ఇక బరువు తగ్గేందుకు తగినంత నీరు తాగడం కూడా కీలకం. దీంతో, జీవక్రియలు వేగవంతమడమే కాకుండా ఆకలి కూడా తగ్గుతుంది. రోజులో పలు మార్లు నీరు తాగడంతో పాటు ఆహారానికి మందు ఒక గ్లాసు నీరు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఆహారం తినే విషయంలో కూడా సమయపాలన పాటిస్తే బరువు త్వరగా తగ్గుతారని నిపుణులు చెప్పే మాట.