Share News

Weight Loss Paralysis: జిమ్ ట్రెయినర్‌కు షాక్.. 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గినందుకు పక్షవాతం!

ABN , Publish Date - Jan 27 , 2025 | 03:08 PM

కేవలం వారం రోజుల్లో 10 కేజీల బరువు తగ్గిన ఓ యువ జిమ్ ట్రెయినర్ చివరకు తాత్కాలిక పక్షవాతానికి గురయ్యాడు. కుడికాలు కదపలేని స్థితికి చేరుకున్నాడు. అయితే, సమస్య మొదలైన వెంటనే వైద్యులను సంప్రదించడంతో అనారోగ్యం నుంచి సులువుగా బయటపడ కలిగారు.

Weight Loss Paralysis: జిమ్ ట్రెయినర్‌కు షాక్.. 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గినందుకు పక్షవాతం!

ఇంటర్నెట్ డెస్క్: కేవలం 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గిన ఓ యువ జిమ్ ట్రెయినర్ తాత్కాలిక పక్షవాతానికి గురయ్యాడు. వెంటనే బాధితుడిని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించగా అతడు స్లిమ్మర్స్ పెరాలిసిస్ బారిన పడ్డట్టు గుర్తించారు (Slimmers paralysis).

నిపుణులు చెప్పే దాని ప్రకారం, అకస్మాత్తుగా బరువు తగ్గిన సందర్భాల్లో అరికాల్లో ఉండే కొవ్వు పొర తగ్గిపోతుంది. ఫలితంగా, కాలి కదలికలు, స్పర్శకు కారణమయ్యే నాడీ కణాలపై ఒత్తిడి పెరుగుతుంది. చివరకు కాల్లో స్పర్శ తగ్గి, కదపలేని స్థితి వస్తుంది (Health).


Tooth pain: పంటి నొప్పితో బాధపడుతున్నారా? వీటిని ట్రై చేస్తే తక్షణ రిలీఫ్!

బరువు తగ్గేందుకు జిమ్‌లో అధికంగా కసరత్తు చేసే వారు ఈ సమస్య బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. ‘‘ఇది చాలా అసాధారణమైన కేసు. అతిగా కసరత్తులు చేస్తే భుజం ఎముకలు స్థాన భ్రంసం చెందుతాయి. వెన్ను, మెడ నొప్పి కూడా వస్తుంది. ఒక్కోసారి తుంటె ఎముకలు కూడా బలహీనపడతాయి. అయితే, కసరత్తుల విషయంలో మరీ హద్దు మీరితే ఇలాంటి పరిస్థితి వస్తుంది’’ అని ప్రముఖ వైద్యుడొకరు తెలిపారు.

Health: ఆహారం తిన్న తరువాత నీరసంగా అనిపిస్తోందంటే ఈ లోపం ఉన్నట్టే!

ఈ ఉదంతంలో బాధితుడు కేవలం రెండు వారాల్లోనే తన బరువులో ఏకంగా 13 శాతం కోల్పోయాడు. ఆ తరువాతే కాలికి సమస్య మొదలైంది. వైద్య పరీక్షల్లో ఇతర సమస్యలేవీ కనిపించకపోవడంతో అకస్మాత్తుగా బరువు తగ్గడమే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు నిర్ధారణకు వచ్చారు.

Heart Attack: అలర్ట్.. ఈ 5 రకాల నొప్పులు ఉంటే గుండె పోటు వచ్చే ఛాన్స్!


ఏమిటీ స్లిమ్మర్స్ పారాలిసిస్!

వైద్య పరిభాషలో దీన్ని పెరోనియల్ న్యూరోపతీ అని అంటారు. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు కాళ్లు కదపలేని స్థితి వస్తుంది. మొదట్లో తాత్కాలిక సమస్యగా మొదలవుతంది. నిర్లక్ష్యం చేసే కొద్దీ శాశ్వత నష్టం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కసరత్తులతో పాటు బేరియాంట్రిక్ సర్జరీ, బరువు తగ్గేందుకు వాడే ఔషధాలు వంటివన్నీ ఈ సమస్యకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు.

Health: రాత్రి ఇలా నిద్రిస్తే ముఖంపై శాశ్వతంగా ముడతలు!

ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గిన సందర్భాల్లో ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. గాల్ స్టోన్స్, డీహైడ్రేషన్, పోషకాల లేమి, తలనొప్పి, నెలసరి సరిగా రాకపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు ముందుగా వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకున్నాకే ముందుకెళ్లాలని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

Read Latest and Health News

Updated Date - Jan 27 , 2025 | 03:51 PM