Foods to Avoid With Coffee: కాఫీ తాగుతూ వీటిని తింటే ఇక అంతే..
ABN , Publish Date - Nov 23 , 2025 | 05:44 PM
కాఫీ తాగే ముందు లేదా తర్వాత కొన్ని ఆహారాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కాఫీలోని పదార్థాలు ఆహారంలోని పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తాయి. అందువల్ల కాఫీ తాగుతూ లేదా తాగిన తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన్నే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. టీ పక్కన పెడితే కాఫీ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, దానిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ఇది మెదడు పనితీరును, ఏకాగ్రతను మెరుగుపరుస్తుందని అంటారు. అంతేకాకుండా, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కూడా చెబుతారు. అయితే, కాఫీని అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళన, ఎముకల సమస్యలు వంటి ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. అంతేకాకుండా, కాఫీ తాగే ముందు లేదా తర్వాత కొన్ని ఆహారాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కాఫీలోని పదార్థాలు ఆహారంలోని పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తాయి. అందువల్ల కాఫీ తాగుతూ లేదా తాగిన తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సిట్రస్ పండ్లు
ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లను కాఫీతో కలిపి అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేయడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది, ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే, కాఫీ సహజంగానే ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది, దానితో పాటు నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలిగి జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తుంది, కాబట్టి వీటిని కలిపి తినడం మంచిది కాదు.
జంక్ ఫుడ్, వేయించిన ఆహారం
స్నాక్స్, జంక్ ఫుడ్ లేదా వేయించిన ఆహారాలు తిన్న తర్వాత, మీరు కాఫీ తాగడం మంచిది కాదు. ఇది అనవసరమైన కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అలాగే, తృణధాన్యాలు తిన్న తర్వాత కాఫీ తాగడం మంచిది కాదు. ఇది తృణధాన్యాలలో ఉండే విటమిన్లు, ఖనిజాలను సరిగ్గా గ్రహించకుండా నిరోధిస్తుంది. కాబట్టి, కాఫీ తాగేటప్పుడు ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.
ఇవీ చదవండి:
కూలిన తేజస్ జెట్.. పాక్ జర్నలిస్టు సంబరం.. షాకింగ్ వీడియో
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ