Fake Raisins Easy Identify: నకిలీ ఎండుద్రాక్ష.. ఈ చిట్కాలతో ఈజీగా కనిపెట్టొచ్చు!
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:02 PM
ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎండు ద్రాక్షకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. దీంతో కొందరు నకిలీ ఎండు ద్రాక్షలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే కొన్ని చిట్కాలతో కల్తీ ఎండు ద్రాక్షను ఈజీగా గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి ఎండు ద్రాక్ష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో వంటల్లో ఎండు ద్రాక్షను ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా స్వీట్లు, పాయసం తయారీలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. అలానే కొందరు వాటినే తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎండు ద్రాక్షకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. దీంతో కొందరు నకిలీ ఎండు ద్రాక్షలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే కొన్ని చిట్కాలతో కల్తీ ఎండు ద్రాక్షను ఈజీగా గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నకిలీ ఎండు(fake raisins) ద్రాక్షను గుర్తించే ముందు...అసలు ద్రాక్షను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. తాజా ద్రాక్షలను ఆవిరి మీద ఉడికించి ఎండలో ఆరబెట్టాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటిని చాలా సమయం పాటు ఎండలో ఎండబెడితే ఎండుద్రాక్ష లభిస్తుంది. కొంతమంది ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న పండ్లకు చక్కెర సిరప్ కలుపుతారు. ఇటీవల, మార్కెట్లలో నకిలీ ఎండుద్రాక్షలు(fake raisins) కూడా అమ్ముడవుతున్నాయి. రోజూ రాత్రి 10 ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి, ఆ నీటితో కలిపి తింటే శరీరానికి మంచిదని(healthy eating) ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు .
ఇక కల్తీ ఎండు ద్రాక్షను గుర్తించడం చాలా ఈజీ(fake food alert) అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ద్రాక్షను ఆవిరి మీద ఉడికించి ఎండబెట్టినప్పుడు, వాటి రంగు కొద్దిగా నిస్తేజంగా ఉంటుంది. అది నకిలీదైతే కెమికల్స్ కలపడంతో ప్రకాశవంతంగా, మెరుస్తూ కనిపిస్తుంది. ఒరిజనల్ ఎండిన ద్రాక్ష తొక్క ముడతలు పడుతుంది. అదే నకిలీవి అయితే వాటి తొక్క ముడతలు లేకుండా ఉంటుంది. ఈ ద్రాక్ష (adulterated dry fruits) పరిమాణంలో, రూపంలో ఒకేలా ఉంటే.. అది స్వచ్ఛమైనది. పరిమాణంలో భిన్నంగా ఉంటే, దానిలో కల్తీ జరిగిందని అర్థం.
స్వచ్ఛమైన ఎండుద్రాక్ష(dry grapes)లు కొద్దిగా తీపి, కొద్దిగా పుల్లని రుచిని కలిగి ఉంటాయి. ఎక్కువ తీపిగా ఉంటే మాత్రం.. వాటిని షుగర్ సిరప్‌లలో నానబెట్టి ఎండబెట్టే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఎండును ద్రాక్షను తింటే కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలను వస్తాయి. అంతేకాదు.. నకిలీ ఎండు ద్రాక్ష కోసం ఉపయోగించిన కెమికల్స్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. అందుకే.. ఏది మంచిది.. ఏది నకిలీది అని గుర్తించి తినాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్