Share News

Constipation: మలబద్ధకం ఎవరికి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది.. లక్షణాలేంటి..

ABN , Publish Date - May 19 , 2025 | 07:54 AM

Constipation Symptoms: మలబద్ధకం అనేది నిజానికి ఒక సాధారణ సమస్యే. పేగు కదలికలో ఇబ్బంది ఏర్పడటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరగక తరచూ ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది. అలాంటప్పుడు కడుపులో తిమ్మిరి, నొప్పి కూడా వస్తాయి. కానీ, తీవ్ర మలబద్ధక సమస్యలు వచ్చేది ఇలాంటి వారిలోనే. ఎందుకిలా జరుగుతుంది. తీవ్రమైనప్పుడు కనిపించే లక్షణాలేంటి..

Constipation: మలబద్ధకం ఎవరికి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది.. లక్షణాలేంటి..
Constipation Symptoms

Who Mostly Suffers With Constipation: నేటి బిజీ జీవితంలో దీర్ఘకాలిక మలబద్ధకం ఒక సాధారణ సమస్యగా మారింది. దీనివల్ల అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రారంభ దశలో చాలామంది ప్రజలు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోరు. కానీ, సకాలంలో చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, మలబద్ధకం వల్ల ఎవరు ఎక్కువగా బాధపడతారు. ఈ సమస్య ఎప్పుడు తీవ్రమవుతుంది అనే విషయాలు తెలుసుకోండి.


మలబద్ధకం అంటే ఏమిటి?

మీ రోజువారీ ఆహారంలో ఫైబర్, ద్రవ పదార్థాల కంటెంట్ స్వల్పంగా ఉన్నా లేదా వ్యాయామాలు చేయకపోవడం వల్ల మలబద్ధకం సమస్య సంభవించవచ్చు. ఎందుకంటే, శరీరానికి కొన్ని పోషకాలు అందితేనే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించే పదార్థాలు తీసుకున్నప్పుడు వారానికి మూడు లేదా అంతకంటే తక్కువసార్లు మలవిసర్జన అవుతుంది. పేగు కదలికలో ఇబ్బంది ఏర్పడటం వల్ల వచ్చే ఈ సమస్యనే మలబద్ధకం అంటారు. వారంలో మూడు సార్లు మాత్రమే మలవిసర్జన అవుతున్నప్పటికీ అలసట, ఉబ్బరం, అసౌకర్యం వంటి లక్షణాలు లేకపోతే దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య లేనట్టే లెక్క.


మలబద్ధకంతో ఎవరు ఎక్కువగా బాధపడతారు?

ఆరోగ్య నివేదికల ప్రకారం, పురుషుల కంటే మహిళల్లో మలబద్ధకం సమస్య రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. స్త్రీల శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల ఎక్కువగా ఉండటం వల్లే మలబద్ధకం సమస్య బారిన పడే అవకాశాలు అధికమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కాకుండా వృద్ధులలో కూడా ఈ సమస్య సంభవిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వారి జీవక్రియ మందగిస్తుంది కాబట్టి వారు తక్కువ చురుగ్గా మారతారు. ఇక పెద్దవయసువారిలో మలబద్ధకం అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.


మలబద్ధకం లక్షణాలు ఏమిటి?

  • వారానికి మూడు లేదా అంత కంటే తక్కువ సార్లు మలవిసర్జనకు వెళ్లడం.

  • గట్టిగా, పొడిగా, లేదా ముద్దగా ఉండే మలం

  • మలవిసర్జన సమయంలో నొప్పి

  • మలం అంతా బయటకు రాలేదనే భావన

  • కడుపు నొప్పి లేదా తిమ్మిరి

  • కడుపులో ఉబ్బరం


సమస్య ఎప్పుడు తీవ్రమవుతుంది?

మలబద్ధకం లక్షణాలు మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే ఉత్సాహం కోల్పోయి రోజువారీ కార్యకలాపాలు చేయడం కష్టతరం అవుతుంది. కొన్నిసార్లు పురీషనాళం నుంచి రక్తస్రావం కూడా రావచ్చు. ఇలా జరిగితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.


Read Also: Sleeping More Than 9 Hours: రాత్రిళ్లు 9 గంటలకు మించి నిద్రపోయే వాళ్లకో హెచ్చరిక

Gut Health: తిన్న తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. పేగు ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..

Health Tips: ఎండకు అలసిపోతున్నారా.. ఈ సరదా వర్కవుట్లతో బైబై చెప్పండి..

Updated Date - May 19 , 2025 | 07:58 AM