Breast Milk: బాలింతలకు పాలు బాగా పడాలంటే ఇవిగో చిట్కాలు..
ABN , Publish Date - Nov 21 , 2025 | 07:28 AM
అప్పుడే పుట్టిన పిల్లలు నుంచి ఆరు నెలలోపు పిల్లలకు తల్లి పాలు చాలా అవసరం. బాలింతలకు పాలు పుష్కలంగా పడితేనే బిడ్డల పొట్ట నిండేది. కానీ కొంత మంది తల్లులకు పాలు సరిగా పడవు. బిడ్డలకు సరిపడ లేకుంటే.. పోత పాలు పోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రకాల ఆహారం రోజూ తీసుకుంటే బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకు చిన్న చిన్న చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. తద్వారా పాలు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేసుకోవచ్చు.

మునక్కాయ కూర.. రసం: మునక్కాయ కూరతోపాటు వాటితో రసం చేసుకుని ఆహారంలో తీసుకోవాలి. మనుక్కాయ రసం అంటే.. మునక్కాయలను శుభ్రం చేసి.. వాటిపైన పొట్టు తీసేయాలి. మిగిలిన భాగాలను మిక్సీలో వేసి.. నీళ్లు పోసి రసంగా చేయాలి. అనంతరం వాటిని వడకట్టి అరకప్పు తాగితే చాలా మంచిది. రోజుకోసారి తాగితే పాలు ఉత్పత్తి అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది.
సోంపు గింజలు: వీటిలో పాల ఉత్పత్తిని పెంచే గుణాలున్నాయి. సోంపు గింజలను నీళ్లలో మరిగించి.. అనంతరం వడకట్టాలి. ఈ నీటిని తరచూ తాగుతూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.
మెంతులు: వీటిలో సైతం పాల ఉత్పత్తిని పెంచే లక్షణాలున్నాయి. ఒక టీ స్పూను మెంతులను నీటిలో మరిగించి వడకట్టి.. అర గ్లాసు నీటిలో తేనే కలుపుకుని తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగితే మంచింది. శరీరంలో పాలను ఉత్పత్తి చేసే గ్రంధులు ఉత్పత్తి అవుతాయి. మెంతుల్లోని ఫైటూ ఈస్ట్రోజెన్ ఉంటుంది. ఇది పాల ఉత్పత్తిని పెంచుతుంది.
దాల్చిన చెక్క: దీనితో టీ తయారు చేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేడి నీళ్లు లేదా పాలల్లో కలుపుకుని తాగినా.. మంచిదే.
వెల్లుల్లి: ఈ రెబ్బల్లో పాల ఉత్పత్తిని పెంచే లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిని నేరుగా తినలేని వారు.. కూరల్లో వేసుకుని తీసుకున్నా మంచిదే. పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.
బాదం పప్పు: రోజుకు గుప్పెడు బాదం పప్పులను తింటే చాలా మేలు జరుగుతుంది. ఈ పప్పులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. బాదం పాలు తాగినా మంచిదే.
మటన్: మటన్ కూరలో లాక్టోజెనిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. రోజూ మటన్ కూర తినడం వల్ల బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
ఆవు లేదా గేదె పాలు: పాలిచ్చే తల్లులు రోజూ ఆవు లేదా గేదె పాలు తాగిన మంచి ఫలితం ఉంటుంది. ఖాళీ పొట్టతో మాత్రం ఉండకూడదు. ఏదో ఒకటి ప్రతి రెండు, మూడు గంటలకోసారి తింటూ ఉండాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
డ్రాగన్ ఫ్రూట్.. ఈ సమస్యలు ఉన్నవారికి మంచిది.!
చలికాలంలో పొద్దున్నే అల్లం తింటే ఏం జరుగుతుందో తెలుసా?..
For More Health News And Telugu News