Share News

Apricot Oil Benefits: ఈ నూనెతో 120 ఏళ్ల ఆయుష్యు మీ సొంతం.. కాశ్మీర్ ప్రజల హెల్త్ సీక్రెట్ ఇదే..

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:56 PM

కాశ్మీర్ ప్రజలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తారు. కొంతమంది 120 సంవత్సరాల వరకు కూడా బతుకుతారు. అయితే, వీరు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Apricot Oil Benefits: ఈ నూనెతో 120 ఏళ్ల ఆయుష్యు మీ సొంతం.. కాశ్మీర్ ప్రజల హెల్త్ సీక్రెట్ ఇదే..
Bitter Apricot Oil Benefits

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని హుంజా లోయ ప్రజలు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతులుగా గుర్తింపు పొందారు. ఎందుకంటే, ఇక్కడి ప్రజలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తారు. కొంతమంది 120 సంవత్సరాల వరకు కూడా బతుకుతారని చెబుతారు. ఈ దీర్ఘాయుష్షు రహస్యం ఏంటో మీకు తెలుసా? అది నేరేడు పండు నూనె (Apricot Oil)!


ఈ నూనెను హుంజా ప్రజలు తరతరాలుగా వాడుతున్నారు. ఇది శరీరానికి శక్తిని, చర్మానికి కాంతిని, జుట్టుకు పోషణను అందిస్తుంది. ముఖ్యంగా, ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తుందని అనేక మంది నమ్ముతారు. ఈ నూనె నేరేడు పండు విత్తనాల నుండి తీసుకుంటారు. ఇందులో 'అమిగ్డాలిన్' అనే సహజ పదార్థం ఉంటుంది, దీన్ని విటమిన్ B17 అని కూడా అంటారు. ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు.


నేరేడు పండు నూనె ప్రయోజనాలు

కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం:

ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు, వాపు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడి నొప్పి తగ్గుతుంది. చలికాలంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

చర్మం, జుట్టుకు బలం:

ఈ నూనెలో విటమిన్ E, C, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతాయి. ముడతలు, పొడిబారడం తగ్గిస్తాయి. జుట్టుకు రాస్తే మూలాలు బలపడతాయి, జుట్టు రాలడం తగ్గుతుంది, సహజ మెరుపు వస్తుంది.


Also Read:

తుపాను తీరప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలి.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

రంగంలోకి ఆమ్రపాలి.. అధికారుల పరుగులే పరుగులు

For More Latest News

Updated Date - Oct 27 , 2025 | 03:01 PM