Fruits: చలికాలంలో ఇమ్యూనిటీ కోసం ఈ పండ్లు తింటే బెటర్
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:48 AM
చలికాలంలో సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది.. దీంతో శరీరానికి కావాల్సిన డి విటమిన్ సరిగా అందదు. శరీరంలో కాల్షియం కొరతతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. మనం నిత్యం తినే కొన్ని పండ్లలో పుష్కలంగా విటమిన్స్ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
శీతాకాలం(winter season) లో వాతావరణం చల్లగా ఉంటుంది. సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన డి విటమిన్ (Vitamin D) సరిగా అందదు. అంతేకాదు చలికాలంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి (Immunity) కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో దొరికే పండ్ల (Fruits)ను తినడం వల్ల ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా ఉండొచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు.
1. చలికాలంలో లభించే ఉసిరికాయ(Amla)లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ - సి జలుబు, దగ్గు, రొంప దరిచేరకుండా చూస్తుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
2. శీతాకాలంలో దానిమ్మ పండు (Pomegranate)సూపర్ ఫుడ్ అని పిలవొచ్చు. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రక్త హీనత (Anemia) రాకుండా చూస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
3. వింటర్ సీజన్ లో దొరికే సీతాఫలం(Custard Apple)లో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ - ఎ,బి పుష్కలంగా ఉంటాయి. ఇది కంటిచూపును మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పులు తగ్గిస్తుంది.
4. చలికాలంలో నారింజ(Citrus Fruits) పండ్లు విరివిగా దొరుకుతాయి. సిట్రస్ జాతి పండ్లలో ఉండే విటమిన్ - సి శరీరానికి తక్షణమే ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. తెల్లరక్త కణాల ఉత్పత్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడే ఇమ్యూనిటీని ఇస్తుంది. అంతేకాదు చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.
5. శీతాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో బొప్పాయి (Papaya) ఒకటి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. శరీరంలోని వేడిని ఉత్పత్తి చేస్తుంది, జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
6. ఆపిల్ (Apple) రోజుకు ఒకటి తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు అంటారు. యాపిల్ లో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే క్వైర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటుంది.
7. చలికాలంలో ఖర్జూరా(Dates)లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన వేడితో పాటు మంచి పోషకాలు లభిస్తాయి. ఖర్జూరం అంటే చిన్నా పెద్ద తెగ ఇష్టపడి తింటారు. ఇందులో ఉండే ఐరన్ రక్తహినత ఇబ్బందులు తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.
8. శీతాకాలంలో విరివిగా దొరికే రేగుపండ్లలో కేలరీలు తక్కువ, విటమిన్లు ఎక్కువ. ఇవి చర్మవ్యాదులను నివారిస్తుంది.. నిద్రలేమి సమస్యను పరిష్కరిస్తుంది.
9. చలికాలంలో పండ్లను ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తింటే మంచిది. రాత్రి పూట పండ్లు తింటే కొంతమందికి జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు తాజా పండ్లను తీనాలి.. ఫ్రిజ్ లో పెట్టిన పండ్ల తినడం మానివేయడం మంచిది.
10. డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూర, సీతాఫలం వంటి తీపి పండ్లను పరిమితంగా తీసుకోవాలి.
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )