Share News

ప్యాకింగ్ ఫుడ్ కొనేముందు ఈ 5 తప్పక చెక్ చేయాలి..

ABN , Publish Date - Jun 22 , 2025 | 10:28 AM

Packaged Food Buying Tips: ప్యాక్ చేసిన ఆహారాలను కొనుగోలు చేసేముందు కొన్ని విషయాలు తప్పక తనిఖీ చేయాలి. లేకపోతే అనవసరంగా లేనిపోని అనారోగ్యాలకు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ప్రధానంగా ఈ కింది 5 విషయాలు ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకండి.

ప్యాకింగ్ ఫుడ్ కొనేముందు ఈ 5 తప్పక చెక్ చేయాలి..
Packaged Food Buying Tips

How to Choose Healthy Packaged Food: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో దాదాపు చాలామంది ఇన్ స్టంట్ ఆహారాలపైనే అతిగా ఆధారపడుతున్నారు. తరచూ ప్యాక్ చేసిన ఆహారాలే తినేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, ఇలాంటి ఆహారాల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు సంస్థలు కొన్నిరకాల పద్ధతులు పాటిస్తాయి. కాబట్టి, ఎలాంటి ప్యాకింగ్ ఫుడ్ కొనుగోలు చేసేటప్పుడు అయిన దానిపై ఉండే లేబుల్ తప్పక చదవాలి. ముఖ్యంగా ఈ 5 విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి.


ప్యాకింగ్ ఫుడ్ కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. గడువు తేదీ

ఫుడ్ ప్యాకెట్ పై ఇచ్చిన గడువు తేదీలోపే అందులోని ఆహారం తింటే సురక్షితం. కాబట్టి, అది నాణ్యత కలిగిన ఆహారం కాదో.. అవునో.. ఎల్లప్పుడూ గడువు తేదీని తనిఖీ చేయండి. బెస్ట్ బిఫోర్ అనేది ఆహారం నాణ్యతను సూచిస్తే.. యూజ్ బై అనేది భద్రతా పరిమితిని సూచిస్తుంది.


2. పదార్థాల జాబితా

ప్యాకింగ్ చేసిన ఆహారపదార్థాల్లో వాడిన ఇంగ్రిడియెంట్స్ జాబితా చెక్ చేయండి. దీని ద్వారా ఉత్పత్తిలో ఏవైనా అలెర్జీ కారకాలు (గింజలు, సోయా లేదా పాల ఉత్పత్తులు వంటివి), కృత్రిమ రంగులు, రుచులు వంటి ఇతర పదార్థాలు ఎంత మోతాదులో కలిపారో తెల్సుకోవచ్చు. ముఖ్య విషయం ఏంటంటే, లేబుల్‌పై 100 mg సోడియం అని పేర్కొన్నట్లయితే.. ఆ చిరుతిండిలో దాదాపు 250 mg ఉప్పు ఉంటుంది. WHO ప్రకారం, ఆరోగ్యంగా ఉండాలంటే మీరు రోజుకు 2,300 mg కంటే ఎక్కువ సోడియం తీసుకోకూడదు.


3. సర్వింగ్ సైజ్

ప్రతి ఫుడ్ లేబుల్‌పై ఒక సర్వింగ్ సైజు ఉంటుంది. కొన్ని రకాల్లో ఒకసారి సర్వింగ్ చేయాలని ఉంటే.. మరికొన్నింటిలో ఒకటి కంటే ఎక్కువ సార్లు సర్వింగ్ చేయాలని ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక 200ml కంటెంట్ ఉన్న జ్యూస్ ప్యాకెట్ ను సర్వింగ్ సైజు ప్రకారం100ml తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తెలియక మొత్తం ఒకేసారి తీసుకుంటే దాని లేబుల్ పై ఉన్న క్యాలరీల కంటే రెట్టింపు వినియోగించినట్లవుతుంది.


4. పోషకాహార సమాచారం

ప్యాక్ చేసిన స్నాక్‌లోని కేలరీలను కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెర, విటమిన్లు, ఖనిజాలుగా వర్గీకరిస్తారు. ఈ స్థాయిలను సాధారణంగా గ్రాముల పరంగా కొలుస్తారు. కార్బోహైడ్రేట్లు, స్టార్చ్, చక్కెర, ఆహార ఫైబర్‌తో ఈ ఆహారాలు తయారవుతాయి. కాబట్టి, ఈ అంశాలను అర్థం చేసుకునేందుకు రెకమెండరీ డైటరీ అలవెనస్ (RDA) విలువలను తనిఖీ చేయండి. మరొక విషయం ఏంటంటే, సున్నా ట్రాన్స్-ఫ్యాట్ స్థాయిలు ఉన్న ఆహారాలను మాత్రమే ఎంచుకోండి.


5. ప్యాకేజింగ్ పరిస్థితి

ప్యాకేజింగ్ చెక్కుచెదరకుండా, దెబ్బతినకుండా అంటే ట్యాంపరింగ్, ఉబ్బడం లేదా లీకేజీ సంకేతాలు ఏవీ లేవని నిర్ధారించుకోండి. దెబ్బతిన్న ప్యాకేజీలో ఆహారం ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని గుర్తించండి. సూచిస్తుంది. అలాగే, ప్రతి ఆహార ప్యాకేజీపై FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లోగో ఉందని ధృవీకరించుకున్నాకే కొనుగోలు చేయండి. ఇది అందులోని ఆహారం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది.


Also Read:

ప్రీ-డయాబెటిస్‌ నయం చేసేందుకు 10 మార్గాలు..

సన్నబడాలనే ఆశతో వెయిట్ లాస్ పిల్స్ వేసుకుంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి..!For More Health News

Updated Date - Jun 22 , 2025 | 10:58 AM