Zubilee Hills Bypoll: బీఆర్ఎస్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి..
ABN , Publish Date - Oct 25 , 2025 | 06:49 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. ఇప్పుడు ప్రచార పర్వం ఊపందుకుంది. నియోజకవర్గ పరిధిలో అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 25: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. ఇప్పుడు ప్రచార పర్వం ఊపందుకుంది. నియోజకవర్గ పరిధిలో అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, బీఆర్ఎస్ ప్రచారం పర్వంపై ఈసీని ఆశ్రయించింది కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయంలోనే టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వీ. కర్ణన్‌ను కలిశారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నిబంధనలకు విరుద్ధగా బీఆర్ఎస్ పార్టీ తమ స్వంత పత్రిక, మీడియాలో విచ్చలవిడిగా ప్రసారాలు చేస్తోందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సామా రామ్మోహన్ రెడ్డి.. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(MCMC) నిబంధనలకు విరుద్ధంగా బిఆర్ఎస్ పార్టీ తమ స్వంత పత్రికల్లో విచ్చల విడిగా ప్రచురిస్తున్న తప్పుడు వార్తలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఎలక్షన్ కమిషన్ నియమావళి ఉల్లంఘన కింద పరిగణిస్తూ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ అభ్యర్ధి ఖర్చుల కింద పరిగణించాలని ఫిర్యాదు చేశామన్నారు. మరే ఇతర పార్టీలకు సంభందించిన వార్తా కథనాలను బిఆర్ఎస్ పార్టీ అనుబంధ ప్రసార సాధనాల్లో ప్రచురించటం లేదన్నారు. కనీసం మీడియా విలువలను ఏమాత్రం పాటించకుండా నిస్సిగ్గుగా ఆ పత్రికలు వ్యవహరించటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు సామ. తమ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఉల్లంఘనలకు పాలుపడుతున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి పట్ల తగు చర్య తీసుకోవాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరామన్నారు.
Also Read:
BCCI: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు.. స్పందించిన బీసీసీఐ
Rohit Good bye To Australia: మేం మళ్లీ ఆడుతామో లేదో.. రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్