Share News

SSC CGL final result 2024: ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

ABN , Publish Date - Mar 13 , 2025 | 09:57 PM

SSC CGL final result 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ తుది ఫలితాలను విడుదల చేసింది. 18,174 మంది అభ్యర్థులను డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రౌండ్‌కు ఎంపిక చేసింది. ఈ వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.

SSC CGL final result 2024: ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
SSC CGL final result

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ( CGL) 2024 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ ఫలితాలతో పాటు క్యాటగిరీ, పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్కులను కూడా ప్రకటించింది. మెరిట్ బేసిస్ కింద మొత్తం 18,174 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరందరూ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రౌండ్‌కు పంపబడ్డారు. అభ్యర్థులు ఈ వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ ssc.gov.inలో చెక్ చేసుకోవచ్చు. కాగా, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ( CGL) టైర్ 1 ఫలితాలు 2024, డిసెంబర్ 5వ తేదీన విడుదల అయ్యాయి. టైర్ 2 ఎగ్జామ్ జనవరి 18,19,20,31వ తేదీల్లో జరిగింది.


ఫలితాలను చెక్ చేసుకోండిలా..

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ( CGL) 2024 ఫలితాలు తెలుసుకోవడానికి ఇలా చేయండి. మొదటగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ ssc.gov.inలోకి వెళ్లండి. హోమ్ పేజ్‌లో ‘Combined Graduate Level Examination, 2024 - Declaration of Final Result’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. అప్పుడు ఓ పీడీఎఫ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అభ్యర్థులు ఆ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.


Also Read:

ఎనర్జీ డ్రింక్స్‌తో పిల్లలకు కిడ్నీ సమస్యల ముప్పు!

కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన అమ్మాయి.. చివరకు ఏం జరిగిందంటే..

మీ వద్ద రూ. కోటి ఉన్నాయని హ్యాపీగా ఉన్నారా? రిస్క్‌లో పడ్డట్టే..

For More Education News and Telugu News..

Updated Date - Mar 13 , 2025 | 09:57 PM