JNTU: 11నుంచి బీటెక్ ఫస్టియర్ తరగతులు
ABN , Publish Date - Aug 07 , 2025 | 08:36 AM
బీటెక్ ఫస్టియర్ తరగతులను ఈ నెల 11నుంచే ప్రారంభించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 14నుంచి తరగతులను ప్రారంభించాలని వర్సిటీ ఉన్నతాధికారులు ముందుగా భావించినప్పటికీ, బుధవారం జరిగిన అకడమిక్ సెనేట్ సమావేశంలో 2025-26 విద్యా క్యాలండర్‌లో స్వల్ప మార్పులను సభ్యులు సూచించారు.
- అకడమిక్ క్యాలెండర్‌లో మార్పులు చేసిన జేఎన్‌టీయూ
- ఆర్25 రెగ్యులేషన్స్‌కు ఆమోదం
హైదరాబాద్ సిటీ: బీటెక్ ఫస్టియర్ తరగతులను ఈ నెల 11నుంచే ప్రారంభించాలని జేఎన్‌టీయూ(JNTU) నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 14నుంచి తరగతులను ప్రారంభించాలని వర్సిటీ ఉన్నతాధికారులు ముందుగా భావించినప్పటికీ, బుధవారం జరిగిన అకడమిక్ సెనేట్ సమావేశంలో 2025-26 విద్యా క్యాలండర్‌లో స్వల్ప మార్పులను సభ్యులు సూచించారు. అలాగే, ఈ ఏడాది నుంచి అమల్లోకి రానున్న కొత్త(ఆర్25) రెగ్యులేషన్స్‌కు సెనేట్ నుంచి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.
కొత్తగా బీటెక్‌లో చేరిన విద్యార్థులకు విద్యా వాతావరణాన్ని, విశ్వవిద్యాలయ సంస్కృతిని పరిచయం చేయడమే లక్ష్యంగా అన్ని అఫిలియేటెడ్ కళాశాలల్లోనూ 11నుంచే ఇండక్షన్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించాలని సెనేట్ నిర్ణయించింది. విద్యార్థులు అన్ని సెషన్లకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, వర్సిటీ నిబంధనలను అఫిలియేటెడ్ కళాశాలలు తప్పనిసరిగా అమలు చేసేలా ఆదేశాలు జారీచేయాలని సెనేట్ సభ్యులు సూచించారు. సమగ్ర అభ్యాస అనుభవం కోసం విద్యార్థులు విద్యా, పాఠ్యాంశాలేతర కార్యక్రమాల్లోనూ పాల్గొనేలా చర్యలు చేపట్టాలని కోరారు.

సెప్టెంబర్ 12నుంచి 14వరకు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు
జేఎన్‌టీయూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని వర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుత సెమిస్టర్‌లోనే పరిశోధకులకు పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పించాలని పేర్కొన్నారు. అకడమిక్ సెనేట్ సమావేశంలో వైస్ చాన్స్‌లర్ కిషన్‌కుమార్ రెడ్డి, రెక్టార్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు కామాక్షిప్రసాద్, బాలునాయక్, కృష్ణమోహనరావు, వసుమతి, తారాకళ్యాణి, చెన్నకేశవ రెడ్డి, గిరిధర్, ప్రిన్సిపాళ్లు సునీతారెడ్డి, సింధు, నర్సింహారెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
దొంగ డెత్ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా
Read Latest Telangana News and National News