Share News

CA Exams Postponed: భారత్ - పాక్ యుద్ధం.. సీఏ పరీక్ష వాయిదా

ABN , Publish Date - May 09 , 2025 | 11:00 AM

CA Exams Postponed: దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్- పాక్ యుద్ధం నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఐసీఏఐ ప్రకటించింది.

CA Exams Postponed: భారత్ - పాక్ యుద్ధం.. సీఏ పరీక్ష వాయిదా
CA Exams Postponed

భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు (CA Exams) వాయిదా పడ్డాయి. ఈరోజు నుంచి ఈనెల 14 వరకు సీఏ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో సీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఐసీఏఐ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. అలాగే తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది. నేటి నుంచి 14 వరకు సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేస్తున్నామంటూ ఐసీఏఐ వైబ్‌సైట్‌లో అధికారిక నోటీసును ఉంచారు.


ముందుగా అనుకున్న ప్రకారం మే 2 నుంచి 14 వరకు ఐసీఏఐ పరీక్షలు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీలలో .. గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. గ్రూప్ 1 తుది పరీక్ష మే 2, 4, 6 తేదీలలో నిర్వహించగా.. గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 13, తేదీలలో జరిగింది. ఆ తరువాత జరగనున్న పరీక్షలను మాత్రం ఐసీఏఐ వాయిదా వేసింది.


కాగా.. భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలైంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్‌ ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌ పేరుతో దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను అంతమొందించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ ఆర్మీ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. అయితే వీటిని సమర్థవంతంగా తిప్పుకొడుతోంది ఇండియన్ ఆర్మీ. అంతేకాకుండా భారత్‌పై మిస్సైల్స్, డ్రోన్లతో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించగా.. వాటిని పనిచేయకుండా చేసింది భారత సైన్యం. అలాగే పాకిస్థాన్‌‌పై మిస్సైల్స్‌‌తో ఎదురుదాడికి దిగింది భారత నావికాదళం. పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టుపై గత (గురువారం) రాత్రి దాడి చేసింది. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోకూడా భారత్‌ దాడి చేసింది. వరుస దాడులతో పాకిస్థాన్ గజగజా వణికిపోతున్న పరిస్థితి. మరోవైపు పాక్ ప్రధాని కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లోని పాక్ ప్రధాని ఇంటికి సమీపంలో భారత్‌ దాడులు చేయడంతో భయంతో ఇంటిని ఖాళీ చేసి పాక్‌ ప్రధాని బంకర్లలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది పంజాబ్ ప్రభుత్వం. అటు జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు లేకుండా కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: మమ్మల్ని ఆదుకోండయ్యా.. అడుక్కొంటున్న పాక్..

Lahore Drone Strike: డ్రోన్‌ దాడి జరిగితే పిడుగుపాటు అని కవరింగ్‌

Read latest Education News And Telugu News

Updated Date - May 09 , 2025 | 11:08 AM