Share News

Operation Sindoor: మమ్మల్ని ఆదుకోండయ్యా.. అడుక్కొంటున్న పాక్..

ABN , Publish Date - May 09 , 2025 | 10:45 AM

భారత్ దెబ్బకు పాకిస్తాన్ అప్పు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. రుణాల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములను వేడుకుంటోంది. పెరుగుతున్న యుద్ధం, పడిపోయిన స్టాక్ మార్కెట్ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ భాగస్వాములను రుణాల కోసం ప్రాథేయపడే దారుణ స్థితికి వచ్చింది.

Operation Sindoor: మమ్మల్ని ఆదుకోండయ్యా.. అడుక్కొంటున్న పాక్..
Operation Sindoor

పహల్గామ్ ఉగ్రవాద దాడుల తర్వాత ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు భారత సైన్యం తగిన గుణపాఠం చెబుతోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌పై భారత సైన్యం విరుచుకుపడుతోంది. భారత్‌ లోని పలు నగరాలను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లను ఉపయోగించి దాడులకు తెగబడింది. అయితే, భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఏ మాత్రం తగ్గకుండా అదే ధీటుగానే పాక్‌పై ప్రతీకార దాడులు చేస్తోంది.


భారత్ చేస్తోన్న ప్రతీకార దాడులకు పాకిస్తాన్ మొత్తం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లోని పలు నగరాలు విధ్వంసం అయ్యాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ అప్పు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. రుణాల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములను వేడుకుంటోంది. పెరుగుతున్న యుద్ధం, పడిపోయిన స్టాక్ మార్కెట్ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ భాగస్వాములను రుణాల కోసం ప్రాథేయపడే దారుణ స్థితికి వచ్చింది.

పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములకు రుణాల కోసం విజ్ఞప్తి చేస్తోన్న ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. ప్రపంచ బ్యాంకుతో సహా అంతర్జాతీయ భాగస్వాముల నుండి రుణాల కోసం పాకిస్తాన్ విజ్ఞప్తి చేస్తోంది. యుద్ధం తీవ్రతరం అవుతుండటం, స్టాక్ మార్కెట్ పడిపోతున్న నేపథ్యంలో మాకు సహాయం చేయాలని వేడుకుంటోంది. కాగా, పాకిస్తాన్‌పై నేడు IMF సమావేశం కానుంది. పాకిస్తాన్‌ను ఆర్థిక సంక్షోభం నుండి కాపాడటానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, IMF నిర్వహణలో భాగమైన భారతదేశం కూడా ఈ సమావేశంలో పాల్గొంటుంది. పాకిస్తాన్‌కు రుణాలు ఇచ్చే అవకాశం లేకుండా భారత్ ఇక్కడ కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్‌కు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం అంటే ప్రపంచ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని సమావేశంలో సభ్య దేశాలకు భారత్ వివరించే పరిస్థితి ఉంది.


Also Read:

India Pakistan War: భారత్‌పై దాడులు.. పాక్ ఫేక్ క్యాంపెయిన్.. అసలు నిజం ఇదే..

Operation Sindoor: దూకుడు పెంచిన పాక్.. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు

Operation Sindoor: పాకిస్తాన్ సైనిక పోస్టుల ధ్వంసం.. ఇండియన్ ఆర్మీ వీడియో వైరల్..

Updated Date - May 09 , 2025 | 11:07 AM