Share News

Telangana MHSRB jobs: తెలంగాణలో ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం..

ABN , Publish Date - Jul 14 , 2025 | 02:54 PM

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో (MHSRB) 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పోస్టులకు అర్హతలు ఏంటి, ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Telangana MHSRB jobs: తెలంగాణలో ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం..
Telangana MHSRB jobs

తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఉద్యోగ వివరాలు

  • సంస్థ: మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB తెలంగాణ)

  • పోస్ట్ పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్

  • ఖాళీల సంఖ్య: 607

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

  • అధికారిక వెబ్‌సైట్: mhsrb.telangana.gov.in

  • దరఖాస్తుకు చివరి తేదీ: జులై 27, 2025

  • దరఖాస్తు సవరణ తేదీ: జులై 28, 2025 నుంచి జులై 29, 2025 వరకు


అర్హత ప్రమాణాలు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కొన్ని అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి MBBS పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా, MD, MS, DNB, M.Sc, DM, M.Ch, Ph.D వంటి అర్హతలు కలిగి ఉండాలి. తెలంగాణ వైద్య రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ ఒక అద్భుతమైన అవకాశం.


వయో పరిమితి

కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు కాగా, గరిష్ట వయస్సు 46 సంవత్సరాలు (01-07-2025 నాటికి)గా నిర్ణయించారు. ఎక్స్-సర్వీస్‌మెన్, NCC అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంటుంది. PH అభ్యర్థులకైతే 10 సంవత్సరాల వరకు ఉంటుంది.


దరఖాస్తు రుసుము

అప్లికేషన్ ఫీజు: అందరికీ రూ. 500. SC, ST, BC, EWS, PH & ఎక్స్-సర్వీస్‌మెన్/తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు. ఇతర అభ్యర్థులకు రూ. 200గా ఉంది.

ఎంపిక విధానం

విద్యార్హత, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు MHSRB తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ mhsrb.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. వివరణాత్మక సూచనల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.


ఇవి కూడా చదవండి


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 02:57 PM