Reading Habits: పఠనాసక్తిని పెంపొందించాలి
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:55 AM
గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా గ్రంథాలయ వారోత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాల్లో గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకుల ప్రేరణ, పుస్తకాల విలువను చెప్పే పలు అంశాలు ఉంటాయి. ఇటీవల విద్యార్థులు చాలా సమయం...
గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా గ్రంథాలయ వారోత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవాల్లో గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకుల ప్రేరణ, పుస్తకాల విలువను చెప్పే పలు అంశాలు ఉంటాయి. ఇటీవల విద్యార్థులు చాలా సమయం మొబైల్ వినియోగంతో వృథా చేస్తున్నారు. దీంతో అనారోగ్యం, చదువులో వెనుకబాటు కలుగుతున్నాయి. ఈ జాడ్యం బాగా విస్తరించింది. దీనిని కొంతవరకైనా తగ్గించే విధంగా తల్లితండ్రులు దృష్టి సారించాలి. పాఠశాలలో రెండవ పూట ఒక పీరియడ్ లేదా వీలైన సమయంలో ఏదైనా ఒక వాచకాన్ని విద్యార్థులతో విధిగా చదివించాలి. కొన్ని నగరాల్లోని పార్కుల్లో శ్రద్ధ గల యువకులు అక్కడికి వచ్చిన పిల్లలను ఏదో వాచకం లేదా నోట్సు చదివిస్తున్నారు. ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉండడం, చదవడం విద్యార్థులకు ఉపయోగం. మరికొన్ని చోట్ల ఒక బుక్ అల్మారా ఏర్పాటు చేసి, అందులో పుస్తకం ఉంచి, ‘పుస్తకం చదవండి’ అనే సూచన పెట్టారు. కథలు, విజ్ఞాన విశేషాలు, మహాత్ముల జీవిత కథలు తెలుసుకోవడం ముఖ్యం. కార్పొరేషన్, జిల్లా విద్యాశాఖ, గ్రంథాలయ సమాఖ్య ఆధ్వర్యంలో పుస్తక పఠనాన్ని పెంపొందించడానికి వివిధ ప్రక్రియలను చేపడితే విద్యార్థులలో ఆసక్తి పెరుగుతుంది. ఆ దిశలో విద్యాభిమానులు కృషి చేయాలి.
బొల్లోజు మేఘనాథం
విశాఖపట్నం
ఇవి కూడా చదవండి..
అలాంటివి మాట్లాడుకోలేదు.. నాటో నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన భారత్..
భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి