Chennai: ముమ్మరంగా వెండి రథం తయారీ పనులు..
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:44 PM
నెల్లయప్పర్ ఆలయం(Nellaiappar Temple)లో వెండి రథం తయారీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తిరునల్వేలి టౌన్(Tirunelveli Town) నెల్లయప్పర్ గాంధీమతి అమ్మవారి ఆలయ వెండి రథంలో 33 ఏళ్ల క్రితం మంటలు చెలరేగి దెబ్బతినింది.

చెన్నై: నెల్లయప్పర్ ఆలయం(Nellaiappar Temple)లో వెండి రథం తయారీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తిరునల్వేలి టౌన్(Tirunelveli Town) నెల్లయప్పర్ గాంధీమతి అమ్మవారి ఆలయ వెండి రథంలో 33 ఏళ్ల క్రితం మంటలు చెలరేగి దెబ్బతినింది. ప్రస్తుత కొత్త వెండి రథం నిర్మాణ పనులు చేపట్టారు. టేకు చెక్కతో తయారవుతున్న ఈ రథానికి రెండు గుర్రాలను వెండి పూతతో కూడిన రెండు ధారుశిల్పాలు రూపొందించే పనులు జరుగుతున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Trains: గుంతకల్లు మీదుగా పలు రైళ్ల దారిమళ్లింపు..
16 అడుగుల ఎత్తుతో 450 కిలోల వెండితో ఈ రథం రూపొందుతోంది. రథం తయారీకి రాజారత్నం, సభాపతి అనే భక్తులు 100 కిలోల వెండిని ఇదివరకే విరాళంగా అందజేశారు. ప్రస్తుతం రథం తయారీకి అవసరమైన వెండి లభించలేదని, భక్తులు, దాతలు వెండిని కానీ, వెండి కొనుగోలుకు నగదు విరాళంగా అందించాలని ఆలయ ట్రస్టీ చైర్మన్ చెల్లయ్య విజ్ఞప్తి చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు
ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్ ఎన్నికలకే మొగ్గు
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర
ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Read Latest Telangana News and National News