Raksha Bandhan: రాఖీ ఏ సమయంలో కట్టాలి?
ABN , Publish Date - Aug 09 , 2025 | 10:45 AM
తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా ప్రతీ ఏటా శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. శనివారం రాఖీ పండుగ సందర్భంగా సోదర, సోదరీ మణులు మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ కడతారు. అనంతరం సోదరుల నుంచి బహు మతులు స్వీకరిస్తారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు తమకు..
Rakhi Festival 2025: తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా ప్రతీ ఏటా శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. శనివారం రాఖీ పండుగ సందర్భంగా సోదర, సోదరీ మణులు మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ కడతారు. అనంతరం సోదరుల నుంచి బహు మతులు స్వీకరిస్తారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు తమకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని నమ్ముతారు. శక్తి స్వరూపిణిగా వ్యవహరించే ఇంటి ఆడపడుచు చేత రక్షాబంధన చేయిస్తే సోదరులకు దేవతలు సైతం రక్షణగా నిలుస్తారని అరిష్టాలు తొలగిస్తారని విశ్వాసం.
పురాణాలు ఏం చెబుతున్నాయి?
హిందూ ధర్మంలో ఏమి చెప్పినా దానికి విశేషమైన అంతర్యం ఉంటుంది. లక్ష్మీదేవి, చంద్రుడు ఇద్దరూ క్షీరసముద్రం నుంచి ఉద్భవించారు. శ్రావణంలో వరలక్ష్మీదేవిని పూజిస్తాం శ్రావణ పౌర్ణమి తిథికి చంద్రుడు ఆది దేవత. లక్ష్మీదేవికి, చంద్రుడికి మధ్య ఉన్నది సోదర, సోదరీమణుల సంబంధం. ఒకే కడువు నుంచి బయటకు వచ్చినవారు. శ్రావణ మాసంలో సోదరి తన సోదరునికి రాఖీ కడుతుంది. రాఖీ పండుగ రోజున లక్ష్మీ నారాయణుని పూజించి రాఖీ కడితే శుభ ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు.
ఎన్ని ముడులు వేయాలి ?
రాఖీ పౌర్ణమి రోజున సోదరి తన సోదరునికి రాఖీ కట్టేడప్పుడు మూడు ముడులు మాత్రమే వేయడం శుభప్రదమంటున్నారు పండితులు. అందులో మొదటి ముడి తన సోదరుడి దీర్ఘాయుష్షు ప్రసాదిస్తుందని.. రెండోముడి రాఖీ కట్టిన సోదరికి దీర్ఘాయుష్షునందిస్తుందని.. ఇక మూడో ముడి వారి అనుబంధంలో మాధుర్యాన్ని పెంచుతుందని నమ్మకం.
రాఖీ ఎప్పుడు కట్టాలి?
శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో రాఖీ కట్టకూడదని పండితులు చెబుతున్నారు. భద్రకాలం ముగిసిన తరువాతే రాఖీ కట్టాలి. జ్యోతిష్యం ప్రకారం రాఖీ పౌర్ణమి వేళ మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి. సర్వార్ధ సిద్ది యోగం, శోభన్ యోగం, సౌభాగ్యయోగం వంటివి ఏర్పడతాయని వారు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమ తిథి అగస్టు 8 మధ్యాహ్నం 2.12 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజైన ఆగస్టు 9న మధ్యాహ్నం గం.124లకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పంచాంగం ప్రకారం భద్రకాలం శనివారం తెల్లవారుజామునే ముగుస్తుంది. సోదరీమణులు రక్షాసూత్రాన్ని తమ సోదరుని మణికట్టుపై శనివారం మధ్యాహ్నాం పౌర్ణమి పడియలు ముగిసేలోపు ఎప్పుడైనా కట్టొచ్చు. శనివారం ఉదయం 5.17 నుంచి మధ్యాహ్నం గం. 1.24 వరకూ శుభసమయం ఉందని పండితులు చెబుతున్నారు.
Also Read:
ట్రంప్ ప్రమాదకర ప్రయోగం..ఆర్థికవేత్త ఘాటు
అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం..
For More Spritual News and Telugu News..