Share News

ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండదు..

ABN , Publish Date - May 25 , 2025 | 07:40 AM

ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండద ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే... ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయమని, సంకల్పబలంతో యత్నాలు సాగించాలని తెలుపుతున్నారు. అంతేగాక.. కృషి నిదానంగా ఫలిస్తుందని, ఆదాయం సామాన్యమని, వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండదు..

అనుగ్రహం

25 - 31 మే 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

గ్రహబలం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. భేషజాలకు పోవద్దు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల హితవు కార్యో న్ముఖులను చేస్తుంది. ధైర్యంగా అడుగు ముం దుకేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచ యాలేర్పడతాయి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలి స్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

లక్ష్యం నెరవేరుతుంది. వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. లావాదేవీలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమ వుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగి స్తారు. ఖర్చులు అధికం. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. కొత్తవ్యక్తులను దరిచేరనీయ వద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆశించిన పదవి దక్కదు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

కార్యసిద్థికి మరింత శ్రమిం చాలి. నిరుత్సాహానికి గురికావద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. ఆటంకాలెదురైనా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఫోన్‌ సందేశాలను పట్టించుకోవద్దు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

ఈ వారం అనుకూలదా యకం. తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడ తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. లావాదేవీల్లో అప్రమ త్తంగా ఉండాలి. మీ ప్రతిపాదనలకు అభ్యం తరాలెదురవుతాయి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ నిర్ణయంపైనే కుటుంబ భవిష్యత్తు ఆధార పడి ఉంది. శుభకార్యంలో పాల్గొంటారు.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

సత్కాలం ఆసన్నమయింది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. ఊహిం చని ఖర్చులు ఎదురవుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. పనుల్లో ఆటంకాలె దురైనా పూర్తి చేయగల్గుతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆత్మీయులతో తరుచూ సంభాషిస్తారు. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

కార్యసాధనలో సఫలీకృతులవు తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగు తాయి. కార్యక్రమాలు వాయిదా పడతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

లావాదేవీలతో తీరిక ఉండదు. ఒప్పందాల్లో సమయస్ఫూర్తిగా మెలగండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞు లను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. పిల్లల విద్యాయత్నం ఫలి స్తుంది. పనులు వేగవంతమవుతాయి. మంగ ళవారం నాడు అనవసర జోక్యం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

మనోధైర్యంతో యత్నాలు సాగించండి. విమర్శలు పట్టించుకోవద్దు. ధృఢసంకల్పంతోనే లక్ష్యం సాధిస్తారు, బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. చీటికిమాటికి చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. గురువారం నగదు డ్రా చేేసటపుడు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

గ్రహబలం అనుకూలంగా ఉంది. ఆటంకాలెదురైనా మీ కృషి ఫలిస్తుంది. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసి వస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. స్నేహసంబం ధాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆప్తులకు మీ ఇబ్బందులు తెలియజేయండి.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

శుభకార్యం విజయవంతమ వుతుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుం టారు. పరిచయాలు, దూరపు బంధుత్వాలు బలపడతాయి. ముఖ్యమైన పత్రాలు అందు కుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చాకచక్యంగా అడుగులేస్తారు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. బుధవారం నాడు అనవసర జోక్యం తగదు. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి రాగల్గుతారు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అన్నిరంగాల వారికీ యోగదాయకమే. స్వయంకృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవు తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ధనసహాయం తగదు. మీ అశక్తతను సున్నితంగా వ్యక్తం చేయండి. సన్నిహితులతో తరచూ సంభాషిస్తారు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆహ్వానం అందుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. సంకల్పబలంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం సామాన్యం. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. అయినవారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి.

భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి

Hyderabad Metro: పార్ట్‌-బీ మెట్రోకు డీపీఆర్‌ సిద్ధం

Read Latest Telangana News and National News

Updated Date - May 25 , 2025 | 07:40 AM