Devotional: ఆ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలమే...
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:54 AM
ఆ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలమే... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారని, చేపట్టిన కార్యం విజయవంతమవుతుందని, అయితే... కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
అనుగ్రహం
28 డిసెంబర్ 2025
- 3 జనవరి 2026
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
మీ ఓర్పునకు పరీక్షా సమయం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. ఏ విషయానికీ నిరుత్సాహపడవద్దు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. మనోధైర్యంతో మెలగండి. సామరస్యంగా సమస్య పరిష్కరించుకోండి. ఆత్మీయులతో సంభాషణ ఊర టనిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. అయినవారిమధ్య కొత్త విషయాలు ప్రస్తావనకువస్తాయి. వేడుకలో పాల్గొంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
ప్రతికూలతలతో సతమతమవు తారు. ఆశావహదృక్పథంతో మెలగండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ేస్నహసంబంధాలు బల పడతాయి. మీ ఉన్నతిని చాటు కోవటానికి వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పరిచయస్తులు తారసపడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. సన్నిహితులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రైవేట్ ఫైనాన్సులలో మదుపు తగదు. అభిప్రాయాలను స్పష్టంగా తెలియ జేయండి. అర్ధాంతరంగా ముగించినపనులు పూర్తిచేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యం కావు. మరోసారి యత్నించండి. చిన్న విషయా నికే నిరుత్సాహపడవద్దు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
చేపట్టిన కార్యం విజయవంతమవుతుంది. అనుకున్నది సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఉత్సా హంగా ముందుకు సాగుతారు. ప్రముఖులకు కానుకలు సమర్పించుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడ తాయి. పనులు చురుకుగా సాగుతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. వేడుకకు హాజరవుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. మీ ఉన్నతిని చాటుకోవటానికి ఖర్చు చేస్తారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్త్తుంది. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. కార్యం సిద్ధిస్తుంది. పరిచయాలు బలపడ తాయి. కానుకలు అందుకుంటారు. పరిచయ స్తుల రాకపోకలు అధికమవుతాయి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖుల సం దర్శనం కోసం పడిగాపులు తప్పవు. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. కొత్త యత్నా లకు శ్రీకారం చుడతారు. ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన కార్యం నెరవేరుతుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. స్థిరాస్తి ధనం అందు తుంది. విలాసాలకు వ్యయం చేస్తారు.పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. బంధుమిత్రులతో విభేదిస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ పొరపాట్లు సరిదిద్దుకోవటం ముఖ్యం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. ఆచితూచి అడుగేయండి. సాహసకృత్యాలకు పాల్పడవద్దు. పరిచయస్తుల వ్యాఖ్యలకు దీటుగా స్పందిస్తారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పిల్లల అత్యు త్సాహం వివాదాస్పదమవుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. పట్టుదలతో కృషి చేేస్త లక్ష్యం నెరవేరుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. పిల్లలకు శుభపరిణామాలున్నాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
సంప్రదింపులు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉం డవు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. పరి చయాలు బలపడతాయి. పరస్పరం కానుకలి చ్చుకుంటారు. కొత్తయత్నాలు చేపడతారు. అవకాశాల కోసం ఎదురుచూడవద్దు. మీదైన తరహాలో శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపు తారు. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
వ్యవహార జయం, కార్యసిద్థి ఉన్నాయి. మీ పట్టుదల ప్రశంసనీయమ వుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి లబ్థి చేకూరుతుంది. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆరోగ్యం జాగ్రత్త. దైవదర్శనాల్లో అవస్థలు ఎదుర్కొంటారు.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్య నుంచి ఉపశమనం కలు గుతుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆర్భాటా లకు ఖర్చు చేస్తారు. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
ఈ వార్తలు కూడా చదవండి..
బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!
ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు
Read Latest Telangana News and National News