Share News

Diwali: 500 ఏళ్ల తర్వాత ఈ రాశులకు రాజ్యయోగం

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:46 PM

దీపావళి వేళ.. కొన్ని రాశులకు వైభవ లక్ష్మీ రాజ్యయోగం ఏర్పడనుంది. దీని వల్ల ఆ రాశుల వారికి అదృష్ట యోగం ఏర్పడనుంది.

Diwali: 500 ఏళ్ల తర్వాత ఈ రాశులకు రాజ్యయోగం

దాదాపు 500 సంవత్సరాల తర్వాత అరుదైన వైభవ లక్ష్మీ రాజ్య యోగం ఏర్పడనుంది. అది కూడా ఈ ఏడాది దీపావళి రోజున అంటే.. అక్టోబర్ 20వ తేదీన ఏర్పడనుంది. ఈ యోగం కారణంగా.. పలు రాశులకు ఆర్థిక, కెరీర్ పరంగా గణనీయ మార్పులు వస్తాయి.

అలాగే విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు సైతం లభించనున్నాయి. ఈ ఏడాది దీపావళి వేళ.. గ్రహ స్థానాలు దాదాపు 500 సంవత్సరాల తర్వాత మారుతున్నాయి. త ద్వారా ఈ మూడు రాశులకు అరుదైన, శక్తివంతమైన వైభవ లక్ష్మీ రాజ్యయోగాన్ని అందిస్తుంది.

ఈ యోగంలో.. కన్యారాశిలో చంద్రుడు (శ్రేయస్సుకు కారకుడు), శుక్రడు (లక్ష్మీ చిహ్నం) కలయిక జరుగుతుంది. ఇది దీపావళి వేళ ఏర్పడనుండడంతో శుభప్రదంగా ఉంటుంది.


కన్య రాశి..

ఈ రాశి వారికి వైభవ లక్ష్మీ రాజయోగం శుభప్రదమైనది. ఈ రాజయోగం ముఖ్యంగా మీ లగ్నరాశిలో ఏర్పడుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ సమయంలో మీకు మీ సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు అందివస్తాయి. పనికి సంబంధించి, సంస్థలో సీనియర్ పదవులు నిర్వహిస్తున్న వారు కొత్త నాయకత్వ అవకాశాలను అంది పుచ్చుకుంటారు. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

విదేశీలలో పని లేదా ప్రయాణ చేసే అవకాశం ఉంది. ఇది మీ విజయాన్ని పెంచుతుంది. కుటుంబ, వైవాహిక జీవితం చాలా సానుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో ప్రేమ అవగాహన పెరుగుతుంది. సంబంధాలు బలపడతాయి. వివాహితులు మరింత మెరుగైన పరస్పర అవగాహనతో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అవివాహితులకు.. వివాహ ప్రతిపాదనలు వారి జీవితాలకు కొత్త ఆనందాన్ని తెస్తాయి.


మకరరాశి..

ఈ రాశి వారు ఈ యోగ ప్రభావంతో కొత్త రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ రాజయోగం మీ సంచార జాతకంలోని అదృష్ట గృహంలో ఏర్పడుతోంది. ఇది ప్రత్యేక అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో మీ అదృష్టం బలంగా ఉంటుంది. చాలా కాలంగా ముందుకు సాగని పనులు సైతం వేగంగా పూర్తవుతాయి. కెరీర్‌లో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఇది మీ పనిలో ప్రమోషన్‌ను సూచిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.

మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. వ్యాపారస్తులకు సైతం ఇది శుభకాలం. దేశంలో కానీ.. విదేశీ ప్రయాణాలు కానీ చేసే అవకాశం ఉంది. దీని వల్ల మీరు లబ్ది పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇది మీ మనస్సుకు శాంతిని కలిగిస్తుంది. వివిధ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు.


కుంభరాశి..

ఈ రాశి వారికి ఈ యోగం కారణంగా.. ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాజయోగం మీ రాశిచక్రానికి సంబంధించిన ఆదాయం, పెట్టుబడి రంగంలో ఏర్పడుతోంది. ఇది మీ ఆదాయంలో పెరుగుదలను స్పష్టంగా సూచిస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. మీ వ్యాపారం కొత్త ఎత్తులకు తీసుకు వెళ్తుంది.

స్టాక్ మార్కెట్ లేదా ఇతర ఆర్థిక రంగాల్లో పెట్టుబడులు మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. లాటరీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కొత్త భాగస్వామ్యాలు.. వారి సహకారం వల్ల ఆఫర్లు అందుకోవచ్చు. ఇది భవిష్యత్తులో గణనీయమైన లాభాలకు దారి తీస్తుంది. మీరు.. మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది.


గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్రం, క్యాలెండర్లు, మతపరమైన గ్రంథాలు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. దీనికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.


ఈ వార్తలు కూడా చదవండి..

దీపావళి వేళ.. దీపాలు వెలిగించే ముందు ఈ చిట్కాలు పాటించండి

దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?

For More devotional News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 04:41 PM