Vinayaka Chavithi: పసుపు గణపతి పూజ..
ABN , Publish Date - Aug 26 , 2025 | 05:30 PM
వినాయకుడు.. విఘ్నలను తొలగించే వాడే కాదు.. ఏ పూజ కానీ.. ఏ వ్రతం కానీ.. ఏ శుభకార్యం కానీ.. వీటని ప్రారంభించాలంటే.. ముందుగా గణనాథుడికి తొలి పూజ చేయాల్సి ఉంటుంది. తొలుత పసుపు ముద్దగా చేసి ఆయన్ని పూజిస్తారు. అనంతరం ఏ పూజనైనా ప్రారంభిస్తారు.
విఘ్నలను తొలగించే వాడే కాదు.. ఏ పూజ కానీ.. ఏ వ్రతం కానీ.. ఏ శుభకార్యం కానీ.. వీటిలో ఏ ఒక్కటి ప్రారంభించాలన్నా.. ముందుగా గణనాథుడిని పూజించాలి. అలాంటి గణపతిని తొలుత పసుపు ముద్దగా చేసి పూజిస్తారు. అనంతరం ఏ పూజ అయిన ప్రారంభిస్తారు.
పూజ ప్రారంభం:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. (గణపతిని ధ్యానించాలి)
(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా)తో నీళ్లు పట్టుకుని)
అనంతరం అపవిత్ర: పవిత్రోవా
సర్వావస్థాం గతోపివా|
యస్మరేత్ పుండరీకాక్షం
సబాహ్యాభ్యంతరస్శుచి:||
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమ: అనుకోవాలి. (అనంతరం కుడి చేతి బొటన వ్రేలితో.. ఆ ఉద్దరిణెలోని నీటిని తలపై మూడు సార్లు చల్లుకోవాలి)
దీపం
ఓం శ్రీగురుభ్యో నమ:
దీపం వెలిగించి.. గంధ పుష్పాదులతో అలంకరించి..దీపదేవతాభ్యో నమ: అని సమస్కరించుకోవాలి.
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
కేశవ నామములు
ఓం గోవిందాయ నమ:
ఓం విష్ణవే నమ:
ఓం మధుసూదనాయ నమ:
ఓం త్రివిక్రమాయ నమ:
ఓం వామనాయ నమ:
ఓం శ్రీధరాయ నమ:
ఓం హృషీకేశాయ నమ:
ఓం పద్మనాభాయ నమ:
ఓం దామోదరాయ నమ:
ఓం సంకర్షణాయ నమ:
ఓం వాసుదేవాయ నమ:
ఓం ప్రద్యుమ్నాయ నమ:
ఓం అనిరుద్దాయ నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం అధోక్షజాయ నమ:
ఓం నారసింహాయ నమ:
ఓం అచ్యుతాయ నమ:
ఓం జనార్దనాయ నమ:
ఓం ఉపేంద్రాయ నమ:
ఓం హరయే నమ:
ఓం శ్రీకృష్ణాయ నమ:
భూతోచ్ఛాటనము..
ఉత్తిష్టంతు భూత పిశాచా: ఏతే భూమి భారకా:
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ఈ శ్లోకము చదివి.. అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమ చేతి వైపు నుంచి వెనక్కి వేయ్యాలి.
ఆ తర్వాత అథ: ప్రాణాయామ: .. చేయాలి
అనంతరం సంకల్పం చెప్పుకోవాలి
కలశ పూజ చేయాలి.
ఉద్వాసన మంత్రాలు ఆచరించిన తర్వాత.. ఏ వ్రతమైనా.. పూజ కానీ ప్రారంభించాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ మాత్రం ఉంచవద్దు.. ఎందుకంటే..
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
మరిన్నీ ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..