Hasanamba Devi Temple: అదిగదిగో హాసనాంబ.. ఏడాది తర్వాత తెరుచుకున్న ఆలయం
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:43 PM
ఏడాదికోసారి మాత్రమే తెరుచుకునే హాసనాంబ దేవి ఆలయం అంగరంగవైభవంగా భక్తజనం నినాదాల మధ్యన గురువారం తెరిచారు. హాసన్ జిల్లా ప్రజలు ఆదిదేవతగా కొలిచే హాసనాంబ ఆలయం మధ్యాహ్నం 12.19గంటలకు శాస్త్రోక్తంగా గర్భగుడి తలుపులు తెరిచారు.
- నాటి నుంచి వెలుగుతున్న అఖండజ్యోతి
- జాతరకు శ్రీకారంతో తరలివచ్చిన భక్తజనం
బెంగళూరు: ఏడాదికోసారి మాత్రమే తెరుచుకునే హాసనాంబ దేవి ఆలయం(Hasanamba Devi Temple) అంగరంగవైభవంగా భక్తజనం నినాదాల మధ్యన గురువారం తెరిచారు. హాసన్(Hasan) జిల్లా ప్రజలు ఆదిదేవతగా కొలిచే హాసనాంబ ఆలయం మధ్యాహ్నం 12.19గంటలకు శాస్త్రోక్తంగా గర్భగుడి తలుపులు తెరిచారు. తళవారం వంశస్తులకు చెందిన నరసింహరాజు ఆలయ ప్రాంగణంలో ఆరటి చెట్లును కత్తిరించడం ద్వారా సంప్రదాయాలకు శ్రీకారం చుట్టారు. గర్భగుడిలో ఏడాది కిందట వెలిగించిన దీపం యథావిధిగా వెలుగుతూ ఉన్నట్లు అర్చకులు ప్రకటించారు. గర్భగుడిలోకి ప్రవేశించాక ప్రత్యేక పూజలు ప్రారంభించారు. అంతకు ముందు ప్రధాన అర్చకుడు నాగరాజు నేతృత్వంలో మంగళవాయిద్యాల మధ్యన పూజా సామాగ్రిని తీసుకువచ్చారు. గర్భగుడికి తలుపులకు పూజలు జరిపారు.

పూజలు నిర్వహించిన పీఠాధిపతులు
ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథ స్వామీజీ, శంభునాథ స్వామీజీ, పుష్పగిరి మఠం సోమశేఖర శివాచార్య స్వామీజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కృష్ణభైరేగౌడ, ఎంపీ శ్రేయస్ పటేల్, ఎమ్మెల్యేలు హెచ్‌పి స్వరూ్‌పప్రకాష్, కెఎం శివలింగేగౌడ, సిమెంట్ మంజు, జిల్లాధికారి లతాకుమారితో పాటు జిల్లాధికారులు పాల్గొన్నారు. గురువారం శాస్త్రోక్తంగా గుడి తలుపులు తెరిచారు. కానీ ఆలయ సంప్రదాయక పూజలు కొనసాగుతాయి. దీంతో భక్తులకు దర్శన అవకాశం ఉండదు. రాత్రిదాకా ప్రత్యేక విధానాలు, పూజలతో పాటు ఆలయ గర్భగుడిలో మరమ్మత్తుల వంటి తాత్కాలిక పనులు పూర్తీ చేస్తారు. శుక్రవారం నుంచి ఈనెల 23వ తేదీ వరకూ పూజలు కొనసాగుతాయి.

హాసనాంబ జాతర కూడా ప్రారంభమైంది. నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా జనసందడి కనిపించింది. జిల్లాకు చెందిన వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భారీకేడ్‌లు అమర్చారు. దర్శనాలకు వచ్చే భక్తులకు అనువుగా పలు సౌలభ్యాలు ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో భారీ స్ర్కీనింగ్‌లు ఏర్పాటు చేశారు. భక్తుల దర్శనాల కోసం ప్రత్యేక టికెట్‌లను కొనుగోలు చేసే పద్దతి తీసుకువచ్చారు. పాలకమండలి వాట్సాప్ చాట్ ద్వారా ఆన్‌లైన్ సేవలు పొందవచ్చును. టికెట్ బుకింగ్‌తో పాటు దర్శన సమయాన్ని ముందుగా నిర్ధారించుకునేందుకు వీలుంటుంది. 63661 05589 నంబరు ద్వారా ఆన్‌లైన్ సేవలు వివరాలు తెలుసుకునేందుకు వీలు కల్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్ మరిచారు
భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త
Read Latest Telangana News and National News