Dasara Festival: దసరా పండగ రోజు.. ఇలా చేస్తే..
ABN , Publish Date - Sep 30 , 2025 | 08:56 PM
దసరా వేళ.. ఇలా చేస్తే తిరుగుండదని అంటున్నారు. ఈ రోజు.. కొన్నింటిని దానంగా ఇవ్వడం వల్ల జీవితంలో మేలు జరుగుతుందని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో ఈ నవరాత్రులు ముగియనున్నాయి. విజయ దశమి దసరా రోజు.. ఈ వస్తువులు దానంగా ఇస్తే.. జీవితంలో అడ్డంకులు తొలిగి అన్ని శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ పండగ సూచిస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. అలాగే ధర్మంతోపాటు దానధర్మాల ప్రాముఖ్యతను సైతం ఈ దసరా పర్వదినం వివరిస్తుంది. ఈ రోజు దానం చేయడం వల్ల కుటుంబ శ్రేయస్సు, శాంతి, సౌభాగ్యం, వృత్తి పరమైన పురోగతిని తెస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు దానం చేయడం వల్ల మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
ఈ పండగ వేళ.. పేద వారికి, బ్రాహ్మణులకు ఆపన్నులకు ఆహార పదార్థాలు అంటే.. బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయాలతోపాటు కొత్త దుస్తులు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం తొలిగిపోతుందని, కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయని చెబుతారు.
దసరా పండగ వేళ.. పసుపు రంగు వస్త్రాలు దానంగా ఇవ్వాలంటారు. వస్త్రాలతోపాటు స్వీట్లు కూడా ఇస్తే.. శుభాలు కలుగుతాయంటారు. ఇలా బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు, సమస్యలు సైతం తొలిగిపోతాయని.. ఇక ఉద్యోగాల్లో సైతం పురోగతి ఉంటుందని సెలవిస్తున్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం.. చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తితోపాటు పేదరికాన్ని సైతం తొలగిస్తుందని పేర్కొంటారు. దసరా రోజు.. దేవాలయంలో కానీ.. పేదలకు కానీ కొత్త చీపురు దానంగా ఇవ్వడం వల్ల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా.. ఇంటిలోని వాస్తు దోషాలను సైతం తొలగించి.. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందంటారు.
అలాగే తెల్లని వస్త్రాలను సైతం దానం చేయవచ్చని చెబుతారు. తెలుగు రంగు స్వచ్ఛత, శాంతి, కరుణకు చిహ్నంగా పరిగణిస్తారు. ఈ రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుందంటారు. జీవితంలో శాంతి లభిస్తుందని, కరుణ భావన సైతం పెరుగుతుందని అంటారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంటారు.
ఈ పండగ రోజు.. కొబ్బరికాయలు, స్వీట్లు దానంగా ఇవ్వడం చాలా మంచిదంటారు. అలాగే ఈ రోజు.. పసుపు, కుంకుమతోపాటు గాజులు సైతం దానంగా ఇస్తారు. వివాహిత మహిళలకు వీటిని దానంగా ఇవ్వడం వల్ల భర్తలకు దీర్ఘాయివు లభిస్తుంది. అమ్మ వారి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుందని చెబుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి వేళ.. ఈ రాశుల జీవితాల్లో వెలుగులే వెలుగులు..
హై బీపీ సమస్య ఇబ్బంది పెడుతోందా?.. జస్ట్ ఈ సింపుల్ చిట్కాలు..
For More Devotional News And Telugu News