Deepavali: దీపావళి వేళ.. ఈ రాశుల జీవితాల్లో వెలుగులే వెలుగులు..
ABN , Publish Date - Sep 30 , 2025 | 08:03 PM
ఈ ఏడాది దీపావళి పండుగ వేళ.. జ్యోతిష శాస్త్రం ప్రకారం అరుదైన గ్రహ సంచారం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ ఏడాది దీపావళి పండుగ వేళ.. జ్యోతిష శాస్త్రం ప్రకారం అరుదైన గ్రహ సంచారం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ధనత్రయోదశి రోజున.. అంటే అక్టోబర్ 18వ తేదీన దేవతలతోపాటు సంపదకు అధిపతి బృహస్పతి.. కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే దాదాపు 200 ఏళ్ల తర్వాత కొన్ని రాశుల వారికి కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. దీంతో ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారం,ఆర్థిక, సామాజిక పరంగా దూసుకుపోనున్నారు.
మిథున రాశి..
ఈ కేంద్ర త్రికోణ రాజయోగం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మీ జాతకంలో బృహస్పతి సంచారం చేస్తున్నందున.. మీరు ఊహించని విధంగా ఆర్థిక లాభాలు పొందనున్నారు. యువత తమ లక్ష్యాలను సాధించడం సులభమవుతుంది. సమాజాంలో కొత్త గుర్తింపుతోపాటు గౌరవాన్ని పొందుతారు.
వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు చేసుకోవడం.. లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు సైతం విజయవంతంగా పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు స్నేహ పూర్వకంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన ఆస్తి సంబంధిత ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.
కన్య రాశి..
ఈ కేంద్ర త్రికోణ రాజయోగం.. ఈ రాశి వారికి చాలా శక్తివంతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలకు అద్భుతమైన లాభాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నగదు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. స్టాక్ మార్కెట్, లాటరీ, పెట్టుబడుల్లో లాభాలు ఆర్జించే అవకాశం బలంగా ఉంది.
తులా రాశి..
కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పటడం వల్ల తులా రాశి వారికి చాలా శుభప్రదమైన రోజుల రానున్నాయి. మీ పని, వ్యాపారంలో అపూర్వమైన పురోగతిని సాధిస్తారు. అలాగే ఈ సమయంలో నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి నూతన లేదా ముఖ్యమైన బాధ్యతలతోపాటు పదోన్నతి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ పనిలో నెలకున్న అడ్డంకులు సైతం తొలగిపోనున్నాయి.
అంతేకాకుండా.. మీ కుటుంబం నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేసుకునేందుకు ఈ సరైన సమయం. వ్యాపారవేత్తలు గణనీయంగా ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం సైతం ఉంది. దీపావళి ముందు వచ్చే ధనత్రయోతో ఈ మూడు రాశుల వారికి దశ.. దిశ తిరుగనుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు.
ఈ వార్తలు చదవండి..
సీఎం చంద్రబాబుపై కేంద్ర మంత్రి పీయూష్ ప్రశంసలు
హై బీపీ సమస్య ఇబ్బంది పెడుతోందా?.. జస్ట్ ఈ సింపుల్ చిట్కాలు..
For More Devotional News And Telugu News