Share News

Hyderabad: నా అన్నతో కలిసి తిరిగితే చంపేస్తానంటూ యువతిపై దాడి..

ABN , Publish Date - Feb 28 , 2025 | 10:44 AM

‘నా అన్నతో కలిసి తిరిగినా.. పెళ్లి చేసుకున్నా.. చంపేస్తాను’ అంటూ బెదిరించడమే కాకుండా యువతిపై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడితో పాటు అతడి మామపై కేసు నమోదు అయ్యింది. బంజారాహిల్స్‌కు చెందిన ఓ యువతికి మూడు సంవత్సరాల క్రితం అర్షద్‌తో పరిచయం ఏర్పడింది.

Hyderabad: నా అన్నతో కలిసి తిరిగితే చంపేస్తానంటూ యువతిపై దాడి..

హైదరాబాద్: ‘నా అన్నతో కలిసి తిరిగినా.. పెళ్లి చేసుకున్నా.. చంపేస్తాను’ అంటూ బెదిరించడమే కాకుండా యువతిపై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడితో పాటు అతడి మామపై కేసు నమోదు అయ్యింది. బంజారాహిల్స్‌(Banjara Hills)కు చెందిన ఓ యువతికి మూడు సంవత్సరాల క్రితం అర్షద్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకోవడంతో పాటూ సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకునేందుకు అర్షద్‌ నిరాకరించడంతో బాధిత యువతి పంజాగుట్ట, అబిడ్స్‌ పోలీసుస్టేషన్‌(Panjagutta, Abids Police Station)లో ఫిర్యాదు చేసింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నాలుగు వేల పెండింగ్‌ చలానా కోసం నా కారునే ఆపుతావా..


ఇదిలా ఉండగా అర్షద్‌ కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. ఈనెల 25న అర్షద్‌ వెంగళరావుపార్కులో సదరు యువతితో మాట్లాడుతుండగా అతని సోదరుడు, మామ వచ్చారు. యువతిని కడుపులో తన్ని తీవ్రంగా కొట్టారు. అర్షద్‌ను వివాహం చేసుకోవద్దని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్‌

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్‌ లేకుండా చూడాలి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2025 | 10:44 AM