Share News

Hyderabad: నాలుగు వేల పెండింగ్‌ చలానా కోసం నా కారునే ఆపుతావా..

ABN , Publish Date - Feb 28 , 2025 | 09:58 AM

‘నాలుగు వేల పెండింగ్‌ చలానా కోసం నా కారునే ఆపుతావా’ అంటూ ట్రాఫిక్‌ పోలీసులపై(Traffic police) ఓ కారు ఓనర్‌ చిందులేశారు. ఎర్రమంజిల్‌ చౌరస్తాలో గురువారం సాయంత్రం పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు(Panjagutta Traffic Police) వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

Hyderabad: నాలుగు వేల పెండింగ్‌ చలానా కోసం నా కారునే ఆపుతావా..

- ట్రాఫిక్‌ పోలీసులపై కారు ఓనర్‌ చిందులు

- పంజాగుట్ట పోలీస్‏స్టేషన్‌లో కేసు నమోదు

హైదరాబాద్: ‘నాలుగు వేల పెండింగ్‌ చలానా కోసం నా కారునే ఆపుతావా’ అంటూ ట్రాఫిక్‌ పోలీసులపై(Traffic police) ఓ కారు ఓనర్‌ చిందులేశారు. ఎర్రమంజిల్‌ చౌరస్తాలో గురువారం సాయంత్రం పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు(Panjagutta Traffic Police) వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో షేక్‌పేటకు చెందిన ఆరిఫ్‌ తార్‌ (నెంబర్‌ టీఎస్‌09 ఎఫ్‌యూ 0786) వాహనంలో ఖైరతాబాద్‌(Khairatabad) వైపు నుంచి బంజారాహిల్స్‌ వైపు వెళ్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: JNTU: కిచెన్‌ వ్యర్థాలతో బయోగ్యాస్‌..


అన్ని వాహనాలను ఆపి పెండింగ్‌ చలానాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ మోజీరాం తార్‌ వాహనాన్ని కూడా ఆపి తనిఖీ చేసి రూ. 4వేల వరకు చలానాలు పెండింగ్‌ ఉన్నట్లు గుర్తించారు. పెండింగ్‌ చలానాలు కట్టాలని పోలీసులు ఆరి్‌ఫకు సూచించారు. దీంతో రెచ్చిపోయిన ఆరిఫ్‌ ‘నాలుగు వేల రూపాయల పెండింగ్‌ చలానా కోసం నా కారు ఆపడానికి మీకు ఎన్ని గుండెలు.. నా ఇంట్లో కారుకు రూ.16వేల పెండింగ్‌ చలానా ఉంది.. ఎవరూ అడగలేదు.. నన్నే ఆపుతావా.. నగదు రెండు నిమిషాల్లో ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తా’ అంటూ ట్రాఫిక్‌ పోలీసుల మీద చిందులేశాడు.


దీంతో ఖైరతాబాద్‌- పంజాగుట్ట(Khairatabad-Punjagutta) మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్‌ సిబ్బంది కారు ముందు టైరుకు వీల్‌ క్లాంప్‌ వేశారు. చలానా డబ్బులు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తీసుకెళ్లాలని అతనికి సూచించారు. అదే సమయంలో వీవీఐపీ మూవ్‌మెంట్‌ ఉండడంతో పోలీసులు వాహనాన్ని పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. పోలీసులు పంజాగుట్ట శాంతిభద్రతల విభాగం పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. చివరికి ఆరిఫ్‌ పెండింగ్‌ చలానాలు చెల్లించినట్టు తెలిసింది.


ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్‌

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్‌ లేకుండా చూడాలి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2025 | 09:58 AM