Share News

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Aug 07 , 2025 | 06:52 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతి మాట్లాడలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం ఎస్‌ఐ ఎం. రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా, దుబ్బాక గ్రామానికి చెందిన గొల్లపల్లి విఠల్‌, శాంతమ్మ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

- ‘ఇన్‌స్టా’ యువతి మాట్లాడలేదని యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పరిచయమైన యువతి మాట్లాడలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం ఎస్‌ఐ ఎం. రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట(Siddipet) జిల్లా, దుబ్బాక గ్రామానికి చెందిన గొల్లపల్లి విఠల్‌, శాంతమ్మ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. సూరారం రాజీవ్‌గాంధీనగర్‌లో 15 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు.


వీరికి ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు సందీప్‌ (20) ఇంటర్‌ వరకు చదివి, కూకట్‌పల్లి(Kukatpally)లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలోని డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతడికి కొంతకాలం క్రితం విజయవాడకు చెందిన ఓ యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయ ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె సందీప్ తో మాట్లాడటం మానేసింది. యువతికి అతడు ఫోన్‌ చేయగా స్పందించకపోవడంతో మనస్తాపం చెందాడు.


city1.2.jpg

మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డ్యూటీకి వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు ఇంటి తలుపులు తెరిచి చూడగా కుమారుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించడంతో స్థానికుల సహాయంతో కిందికి దించారు. కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులోఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దొంగ డెత్‌ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 06:52 AM