Share News

Hyderabad: ప్రేమ పెళ్లి.. భర్త వేధింపులతో ఏడాదికే భార్య ఆత్మహత్య

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:04 PM

ఒకే కాలనీకి చెందిన యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఏడాది గడవకముందే భర్త తాగుడుకు బానిసై భార్యను డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Hyderabad: ప్రేమ పెళ్లి.. భర్త వేధింపులతో ఏడాదికే భార్య ఆత్మహత్య

హైదరాబాద్: ఒకే కాలనీకి చెందిన యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఏడాది గడవకముందే భర్త తాగుడుకు బానిసై భార్యను డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌(Jawaharnagar Police Station) పరిధిలోని ముత్తుస్వామి కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. సీఐ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ముత్తుస్వామి కాలనీలో దాసరి మహేష్‌, అతడి భార్య రమ్య ఉంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తాగునీటితో బైక్‌ క్లీనింగ్‌.. వ్యక్తికి జరిమానా


2024 ఫిబ్రవరిలో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మహేష్‌ జులాయిగా తిరుగుతూ తాగుడుకు బానిసయ్యాడు. మద్యం కోసం డబ్బులు కావాలని భార్యను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మద్యం తాగి వచ్చి రమ్యను కొట్టాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు సర్ధిచెప్పి ఇంటికి పంపించారు. ఈ నెల 4న మహేష్‌ తాగివచ్చి భార్యతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.


city11.2.jpg

దీంతో మనస్తాపానికి గురైన రమ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన మహేష్‌(Mahesh) తలుపులు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే రమ్య ఉరేసుకుని మృతిచెందింది. అయితే తన కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి భర్త వేధింపులే కారణమని రమ్య తల్లి ఐలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మహేష్‏ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సైదయ్య వెల్లడించారు.


ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు

ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!

ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 06 , 2025 | 02:00 PM