Share News

Hyderabad: భార్యపై దాడి.. చనిపోయిందనుకుని పోలీస్‏స్టేషన్‌కు..

ABN , Publish Date - Feb 08 , 2025 | 10:30 AM

భార్యాభర్తల మధ్య వివాదం చివరికి ఒకరిపై దాడికి దారి తీసింది. కోపంతో ఊగిపోయిన భర్త భార్యపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. చైతన్యపురి పోలీసులు(Chaitanyapuri Police) వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక ఆర్‌కేపురం రోడ్‌ నెంబర్‌.3(RK Puram Road No. 3)లో పబ్బు వెంకటేష్‌(36) సునీత దంపతులు ఉంటున్నారు.

Hyderabad: భార్యపై దాడి.. చనిపోయిందనుకుని పోలీస్‏స్టేషన్‌కు..

- దంపతుల మధ్య వాగ్వాదంతో ఘటన

హైదరాబాద్: భార్యాభర్తల మధ్య వివాదం చివరికి ఒకరిపై దాడికి దారి తీసింది. కోపంతో ఊగిపోయిన భర్త భార్యపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. చైతన్యపురి పోలీసులు(Chaitanyapuri Police) వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక ఆర్‌కేపురం రోడ్‌ నెంబర్‌.3(RK Puram Road No. 3)లో పబ్బు వెంకటేష్‌(36) సునీత దంపతులు ఉంటున్నారు. వెంకటేష్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య సునీతపై అనుమానం పెంచుకున్న వెంకటేష్‌ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సర్వర్‌లో సాంకేతిక సమస్యలు.. ట్యాంకర్ల బుకింగ్‌కు ఇబ్బందులు


వాగ్వాదం పెరగడంతో కోపంతో ఊగిపోయిన అతడు భార్యపై విచక్షణారహితంగా దాడిచేశాడు. సునీత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భయపడి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ప్రశ్నించానని, గొడవ పెద్దది కావడంతో దాడి చేయాల్సి వచ్చిందని పోలీసులకు చెప్పాడు. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలకు గాయాలైన సునీతను కొత్తపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు.


ప్రస్తుతం ప్రాణాపాయం తప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వెంకటేష్‏పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, మొదట్లో వెంకటేష్‌ ఎల్‌బీనగర్‌ పోలీస్‏స్టేషన్‌లో లొంగిపోగా ఘటన జరిగిన ప్రాంతం చైతన్యపురి పీఎస్‌ పరిధిలోకి వస్తుండడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట

ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు‌ కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 08 , 2025 | 10:30 AM