Hyderabad: కోర్టు చలానా కట్టేందుకు వెళ్లి..
ABN , Publish Date - Feb 20 , 2025 | 09:41 AM
కోర్టు చలానా కట్టేందుకు వెళ్లిన ఓ న్యాయవాది ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ(Chilakalguda)కు చెందిన వెంకటరమణ (57) సికింద్రాబాద్ సివిల్ కోర్టులో సీనియర్ న్యాయవాది.
- కింద పడి న్యాయవాది మృతి
- మారేడుపల్లి పీఎస్ పరిధిలో ఘటన
హైదరాబాద్: కోర్టు చలానా కట్టేందుకు వెళ్లిన ఓ న్యాయవాది ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ(Chilakalguda)కు చెందిన వెంకటరమణ (57) సికింద్రాబాద్ సివిల్ కోర్టులో సీనియర్ న్యాయవాది. బుధవారం ఉదయం విధి నిర్వహణలో భాగంగా కోర్టు చలానా కట్టేందుకు మారేడుపల్లి ఇండియన్ బ్యాంకుకు ఆయన చేరుకున్నాడు. కిటికీకి ఉన్న బ్యాంక్ చలానా (ఓచర్) తీస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కిడ్నాప్‌నకు గురైన బాలుడు 48 గంటల్లో తల్లి ఒడికి..
దీంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. బ్యాంకు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ వెంకటేష్(Inspector Venkatesh)తో పాటు కానిస్టేబుళ్లు ఇక్కడికి చేరుకున్నారు. వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వచ్చారు. త్వరితగతిన సీపీఆర్ చేసినా ప్రయోజనం చేకూరలేదని తెలిపారు. ఆమేరకు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకుకు చేరుకున్న కుమార్తె తండ్రి విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరైంది. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
మంచి స్నేహితుడిని కోల్పోయాం: న్యాయవాదులు
సీనియర్ న్యాయవాది వెంకటరమణ లాంటి మంచి స్నేహితుడిని కోల్పోయామని సికింద్రాబాద్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వై. వసంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. ఈ విషయాన్ని బంధువులు, స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. కాగా, బ్యాంకు వద్దకు భారీగా న్యాయవాదులు చేరుకున్నారు.

ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’ వివాదం
ఈవార్తను కూడా చదవండి: రోస్టర్ విధానంలో లోపాలు సరిచేయండి
ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్ పాల్గొనాలి..
Read Latest Telangana News and National News