Share News

Hyderabad: బెట్టింగ్‌లో నష్టపోయి.. అప్పులపాలై..

ABN , Publish Date - Sep 12 , 2025 | 08:12 AM

ఐపీఎల్‌ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్న ఇద్దరు స్నేహితులు బంగారు నగల దుకాణంలో చోరీ చేశారు. వీరిని అరెస్ట్‌ చేసిన సీసీఎస్‌ పోలీసులు ముక్కలుగా చేసిన 850 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: బెట్టింగ్‌లో నష్టపోయి.. అప్పులపాలై..

- దొంగతనాల బాట

- నగల దుకాణంలో చోరీ చేసిన మిత్రులు

- అరెస్ట్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: ఐపీఎల్‌ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్న ఇద్దరు స్నేహితులు బంగారు నగల దుకాణంలో చోరీ చేశారు. వీరిని అరెస్ట్‌ చేసిన సీసీఎస్‌ పోలీసులు ముక్కలుగా చేసిన 850 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముంబై గుర్‌గావ్‌(Mumbai Gurgaon)కు చెందిన చడావా రోనక్‌ (24), ముంబై డోంగ్రీ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ గులాం రసూల్‌ (22) స్నేహితులు.


బెట్టింగ్‌కు అలవాటు పడిన వీరు ఐపీఎల్‌ మ్యాచ్‌లలో బెట్టింగ్‌లు పెట్టి నష్టపోయారు. ఆరు నెలల క్రితం చడావా రోనక్‌కు షనాయా డైమండ్స్‌ సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం వచ్చింది. విధి నిర్వహణలో పలు బంగారు నగల దుకాణాలకు వెళ్లే చడావా రోనక్‌ ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే నగల దుకాణంలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికి గులాం రసూల్‌ కూడా సరేనన్నాడు.


city4.jpg

వీరిద్దరూ కలిసి బషీర్‌బాగ్‌లోని విజయ్‌ సర్కార్‌లాల్‌ జువెలర్స్‌(Vijay Sarkarlal Jewellers)లో చోరీ చేయాలని పథకం వేసుకున్నాడు. పథకంలో భాగంగా ఈనెల 5న నగల దుకాణంలో దూరి బంగారు, డైమండ్‌ నగలు చోరీ చేశారు. నగలను కరిగించేందుకు చిన్న ముక్కలుగా చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైఫాబాద్‌, సీసీఎస్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. నాంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు

లాకర్‌ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 12 , 2025 | 08:12 AM