Share News

Hyderabad: అయ్యోపాపం.. వీరికి ఎంతకష్టం వచ్చిందో.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jul 17 , 2025 | 09:57 AM

తల్లిదండ్రులు వివాహాన్ని అంగీకరించకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంతో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన బస్తీరాం కుటుంబసభ్యులతో కలిసి కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు.

Hyderabad: అయ్యోపాపం.. వీరికి ఎంతకష్టం వచ్చిందో.. ఏం జరిగిందంటే..

  • ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

  • వివాహమై నాలుగు నెలలే..

హైదరాబాద్: తల్లిదండ్రులు వివాహాన్ని అంగీకరించకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంతో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌(Amberpet Police Station) పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన బస్తీరాం కుటుంబసభ్యులతో కలిసి కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు పవన్‌ కుమావత్‌ (21) దాదాపు నాలుగు నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఆసియా హసీం ఖాన్‌(29)ను వివాహం చేసుకున్నాడు.


అయితే ఆ పెళ్లిని పవన్‌ కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో తాను ఆసియా హసీం ఫాతిమాను వివాహం చేసుకున్నట్లు ఈనెల 10వ తేదీన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌(KPHB Police Station)లో ఫిర్యాదు చేశాడు. వివాహమైన నాటి నుంచి వారిద్దరూ గోల్నాక లక్ష్మీనగర్‌లో నివసిస్తున్నారు. వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం ఇంటి యజమాని అద్దె డబ్బుల కోసం మొదట ఆసియాకు ఫోన్‌ చేశాడు. ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో పవన్‌కు ఫోన్‌ చేశాడు. సాయంత్రం డబ్బులు ఇస్తానని చెప్పాడు.


city5.2.jpg

ఇంటికి వచ్చి చూడగా ఆసియా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. ఆందోళన చెందిన పవన్‌ ఆసియాను కిందికి దించి తాను కూడా అదే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం వరకు ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా అప్పటికే ఇద్దరు మృతి చెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 17 , 2025 | 09:57 AM