Share News

Tirupati News: నా భర్తను చంపేశారు సారూ...

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:15 AM

‘నా భర్తను మా అత్త, బావ చంపేశారు. పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు’ అంటూ బాధితురాలు హేమలత ఎస్పీ సుబ్బరాయుడు ఎదుట సోమవారం పీజీఆర్‌ఎస్‏లో మొర పెట్టుకున్నారు. ‘మాది వడమాలపేట మండలం ఎస్‌బీఆర్‌పురం. సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన కృష్ణకుమార్‌తో 2023లో నాకు వివాహమైంది. నా భర్తకు అన్న కిరణ్‌కుమార్‌, సోదరి అశ్విని ఉన్నారు.

Tirupati News: నా భర్తను చంపేశారు సారూ...

- పోలీసులు న్యాయం చేయట్లేదు

- పీజీఆర్‌ఎస్‏లో ఎస్పీ ఎదుట బాధితురాలి మొర

తిరుపతి: ‘నా భర్తను మా అత్త, బావ చంపేశారు. పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు’ అంటూ బాధితురాలు హేమలత(Hemalatha) ఎస్పీ సుబ్బరాయుడు ఎదుట సోమవారం పీజీఆర్‌ఎస్‏లో మొర పెట్టుకున్నారు. ‘మాది వడమాలపేట మండలం ఎస్‌బీఆర్‌పురం. సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన కృష్ణకుమార్‌తో 2023లో నాకు వివాహమైంది. నా భర్తకు అన్న కిరణ్‌కుమార్‌, సోదరి అశ్విని ఉన్నారు. ఆ తర్వాత నేను డెలివరీ కోసం పుట్టింటికి వచ్చా.


ఆ సమయంలో నా భర్త, అతడి అన్న మధ్య ఆస్తుల తగాదాలు చోటు చేసుకున్నాయి. అనంతరం తరచూ గొడవలు జరిగేవి. మా బావ కిరణ్‌కుమార్‌కు మగ బిడ్డ, ఆడ బిడ్డ ఉన్నారు. మాకు మగ బిడ్డ పుట్టడంతో, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందన్న ఆక్రోశంతో నా భర్తను అంతమొందించాలని పథకం పన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 12న ఇంట్లో ఉన్న నా భర్తపై అత్త వసంతమ్మ, బావ కిరణ్‌కుమార్‌ దాడి చేయడంతో మృతిచెందారు. నేను అత్తింటికి వెళ్లేటప్పటికే ఖననం చేశారు. నేను భయపడి పుట్టింటికి వచ్చా. వడమాలపేట పోలీసులకు ఫిర్యాదు చేశా. పోలీసులు కనీసం స్పందించలేదు. ఆ తర్వాత కర్మక్రియలకు వెళ్లగా నాపై నా భర్త మేనమామ కుమారుడు భరత్‌ కర్రలతో దాడి చేశారు.


దీనిపై సెప్టెంబరు 28న ఫిర్యాదు చేశా. న్యాయం చేయాలని పలు సార్లు వడమాలపేట పోలీసులను ప్రాధేయపడినా పట్టించుకోలేదు. చివరకు సెప్టెంబరు 29న కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. నా భర్త చనిపోయిన సమయంలో మా అత్త ఇంట్లో ఉన్న నా పదో తరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్లు ఇప్పించాలని పోలీసులను కోరినా ఫలితం లేదు. ఇప్పటికీ నాకు న్యాయం చేయకపోగా పోలీసుల నుంచి ఒత్తిడి ఉంది. పెళ్లి సమయంలో మా అమ్మ వారు పెట్టిన 10 సవర్ల బంగారు నగలు మా అత్త వద్ద ఉన్నాయి. అవి ఇప్పించండం. నాకు న్యాయం చేయండి’ అంటూ ఆమె చంటిబిడ్డతో వచ్చి ఎస్పీ సుబ్బరాయుడిని ప్రాధేయ పడ్డారు. దీనిపై విచారించి, న్యాయం చేస్తామని బాధితురాలికి ఎస్పీ హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఓటర్ల సమస్యకు సత్వర పరిష్కారం

అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 04 , 2025 | 11:15 AM