Share News

Hyderabad: బ్రౌన్‌ షుగర్‌ అమ్ముతున్న ముగ్గురు యువకుల అరెస్టు

ABN , Publish Date - Jan 17 , 2025 | 01:57 PM

నిషేధిత బ్రౌన్‌షుగర్‌(Brown sugar)ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు యువకులను కేపీహెచ్‌బీ పోలీసులు(KPHB Police) అరెస్టుచేశారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం... కలాలి నాని(25), కుర్వ ప్రకాశ్‌(30), గాండ్ల నవీన్‌కుమార్‌(30) ఈజీగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్‌ అమ్మాలని పథకం వేసుకున్నారు.

Hyderabad: బ్రౌన్‌ షుగర్‌ అమ్ముతున్న ముగ్గురు యువకుల అరెస్టు

హైదరాబాద్: నిషేధిత బ్రౌన్‌షుగర్‌(Brown sugar)ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు యువకులను కేపీహెచ్‌బీ పోలీసులు(KPHB Police) అరెస్టుచేశారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం... కలాలి నాని(25), కుర్వ ప్రకాశ్‌(30), గాండ్ల నవీన్‌కుమార్‌(30) ఈజీగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్‌ అమ్మాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు యువకులు కూకట్‌పల్లి ఎల్లమ్మబండకు చెందిన వరుణ్‌(24) అనే యువకుడి వద్ద నుండి రూ.14,000 చెల్లించి 2గ్రాముల బ్రౌన్‌షుగర్‌ కొనుగోలు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: సంక్రాంతికి ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల..


zzzzzzzzzzzzzzzz.jpg

దాన్ని ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. బుధవారం సాయంత్రం 6.30గంటలకు కేపీహెచ్‌బీ కాలనీ విశ్వనాథ్‌ థియేటర్‌ వద్ద దానిని అమ్మేందుకు ప్రయత్నించారు. తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు నాని, ప్రకాష్‌, నవీన్‌ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి బ్రౌన్‌ షుగర్‌ పాకెట్‌ను, ద్విచక్రవాహనం, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 17 , 2025 | 01:57 PM