Share News

Hyderabad: 2 నెలల నుంచి వేరుగా కూర్చోబెట్టి వేధించారు..

ABN , Publish Date - Jan 28 , 2025 | 12:57 PM

హయత్‌నగర్‌(Hayatnagar)లోని తెలంగాణా గిరిజన రెసిడెన్సిల్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని సౌమ్య(17) ఆదివారం రాత్రి హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లితండ్రి పద్మా, శివశంకర్‌(Padma, Shivshankar) కుటుంబ సభ్యులు సోమవారం కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

Hyderabad: 2 నెలల నుంచి వేరుగా కూర్చోబెట్టి వేధించారు..

- అవమానం భరలించలేక ఆత్మహత్య చేసుకుంది

- ఆదివారం రాత్రి హాస్టల్‌లో ఉరేసుకుని సౌమ్య బలవన్మరణం

- గిరిజన రెసిడెన్సియల్‌ కళాశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

- బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆర్‌డీవో, ఏసీపీ

హైదరాబాద్: హయత్‌నగర్‌(Hayatnagar)లోని తెలంగాణా గిరిజన రెసిడెన్సిల్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని సౌమ్య(17) ఆదివారం రాత్రి హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లితండ్రి పద్మా, శివశంకర్‌(Padma, Shivshankar) కుటుంబ సభ్యులు సోమవారం కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కళాశాల సిబ్బంది తమ కుమార్తెను రెండు నెలల నుంచి తరగతిలో వేరుగా కూర్చోబెట్టి వేధించారని, అవమానం భరించలేకనే సౌమ్య ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: MP R. Krishnaiah: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలి


తమ కుటుంబానికి న్యాయం చేయాలని, నష్టపరిహారం రూ.20లక్షల నగదు, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. హయత్‌నగర్‌(Hayatnagar) మండల ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎ విద్యార్థి సంఘాల నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు సంఘభావం తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు కళాశాల వద్దకు వచ్చి విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.


city9.jpg

జిల్లా కలెక్టర్‌ ఆదేశం మేరకు ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో అనంతరెడ్డి, హయత్‌నగర్‌ తహసీల్దార్‌ జానకీ, వనస్థలిపురం ఏసీపీ కాశీరెడ్డి కళాశాలకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. సమస్యను కలెక్టర్‌ను నివేదించి న్యాయం చేస్తామని హమీఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులు హయత్‌నగర్‌ పోలీస్‏స్టేషకు(Hayatnagar Police Station) చేరుకుని సాయంత్రం ఆరు గంటల వరకు పోలీసులతో చర్చలు జరిపారు. 8 గంటల సమయంలో ఎస్‌ఐ లింగారెడ్డిని సంప్రదించగా ఇంతవరకు బాధితులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ప్రసుత్తం సౌమ్య మృతదేహం ఉస్మానియా ఆస్పత్రిలో ఉంది.


వార్తను కూడా చదవండి: CM Revanth Reddy: టకీ టకీ భరోసా..

ఈవార్తను కూడా చదవండి: పరిగిలో పట్టపగలే చోరీ

ఈవార్తను కూడా చదవండి: సూర్యాపేటలో యువకుడి పరువు హత్య?

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 28 , 2025 | 12:57 PM